గ్రామాలు ఆర్థికంగా మరియు వ్యవసాయ రంగం లో అభివృద్ధి చెందాలన్న , ఉపాధి అవకాశాలు మెరుగు పడాలన్న రహదారులు సౌకర్యంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

పత్రికా ప్రకటన                                                                   తేది : 18-08-2021

గ్రామాలు ఆర్థికంగా మరియు వ్యవసాయ రంగం లో అభివృద్ధి చెందాలన్న , ఉపాధి అవకాశాలు మెరుగు పడాలన్న రహదారులు  సౌకర్యంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

బుధవారం భాలభావన్ లో పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యం లో ఆజాద్ కి అమృత్ మహోత్సావం  లో భాగంగా నిర్వహించిన ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమం లో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రధానంగా ఆ గ్రామాలకు ఉన్న రహదారుల సౌకర్యము పై ఆధారపడి ఉంటుందని అన్నారు. గ్రామాలలో రవాణా సౌకర్యం మెరుగు పరచడానికి కేంద్రం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకము ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఈ పథకమునకు సంబంధించి పూర్తి నిధులు ఫేస్-1 లో పూర్తిగా ఫేస్-2 లో 75:25 నిష్పత్తి లో ఫేస్-3 లో 60:40 నిష్పత్తి లో కేంద్ర ప్రభుత్వము సమకుర్చిందని తెలిపారు.   ఈ పథకము ద్వారా 1000 జనాభాకు పైబడి ఉన్న గ్రామాలకు తారు రోడ్డు, 500-1000 లోపు జనాభా కలిగి ఉన్న గ్రామాలకు మొరము రోడ్డు, 250 పై బడిన జనాభా ఉన్న గిరిజన ఆవాసాలకు మొరము రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పతకము ద్వారా చేపట్టిన పనుల సంఖ్య 33 అయితే జూలై 2021 నాటికి 27 పనులు పూర్తి అయినట్లు, వీటికి 33.76 కొట్లలో నిధులు ఖర్చు అయినవని తెలిపారు. ఈ పథకము కేవలం రహదారులు లేని గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమని తెలిపారు. బి.టి రోడ్ల కన్న సి.సి. రోడ్లు వేస్తే తక్కువ ఖర్చు తో ఎక్కువ రోడ్లు వేయొచ్చని , పనులలో వేగం పెంచాలని అన్నారు. చేసే పనులలో అందరి సహకారం  ఉంటే పనులు త్వరగా పూర్తి చేయవచ్చని అన్నారు. జిల్లా లో నిర్మించిన రైతు వేదికలు బాగున్నాయని, నాణ్యత బాగుందని ఎంపిటిసిలను, సర్పంచులను, ఈ.ఈ.లను   అభినందించారు.

అలంపూర్ శాసన సభ్యులు డా.అబ్రహం జ్యోతి ప్రజ్వలన గావించి , మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సర్పంచుల బాధ్యత అని, మెరుగైన రవాణా సౌకర్యం ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కలెక్టర్ గారి  చొరవతో రోడ్ల కి ఇరువైపులా చెట్లు నాటడం జరిగిందని , వాటిని సంరక్షించాలని అన్నారు.  లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కల్పించుటలో పంచాయత్ రాజ్ ఎ.ఈ , డి.ఈ., ఎంపిటిసి, జెడ్పిటిసి, సర్పంచులు వారి బాధ్యత తో కృషి చేయాలనీ కోరారు. టేరాజైన్ టెక్నాలజీ సుమన్ రోడ్లు వేయడం లో ఉపయోగించే టెక్నాలజీ పై వివరించారు. ఎం.పి.పి. గట్టు , జెడ్పిటిసి లు , డి.ఈ. లు , తదితరులు మాట్లాడారు.

ఈ సమావేశం లో పంచాయత్ రాజ్  ఈ.ఈ. సమత, డి.ఈ. రవీందర్, గట్టు ఎం.పి.పి. విజయ్ కుమార్,  ఎంపిటిసి లు, జెడ్పిటిసి లు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————— 

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post