గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రత తో సమృద్ధం గా అభివృద్ధి చెందాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రత తో సమృద్ధం గా అభివృద్ధి చెందాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రత తో సమృద్ధం గా అభివృద్ధి చెందాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ఫత్తేపూర్, తొర్రూరు మండలం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -06:

గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రత తో సమృద్దంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం తొర్రూరు మండలం ఫత్తేపుర్ గ్రామం లో జిల్లా కలెక్టర్ కె. శశాంక పర్యటించి గ్రామంలోని అంబేడ్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి గ్రామ ప్రగతి రిపోర్టు ఫ్లెక్సీ ను పరిశీలించారు.

గ్రామంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ జరుగుతున్న వివరాలను తెలుసుకొని, తడి, పొడి చెత్త సేకరణకు ఇచ్చిన డస్ట్ బిన్ లను వాడాలని, ఆరు బయట వేయరాదని, జి.పి. ట్రాక్టర్, చెత్త వాహనంలో వేసి గ్రామంలో పారిశుద్ధ్యం పాటించాలని తెలిపారు. ఊరిలో ఉన్న 700 ఇళ్లకు గాను ప్రతి రోజు కనీసం 200 ఇళ్ల నుండి చెత్త సేకరించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం పై ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని తెలిపారు.

హరిత హారం నర్సరీ నీ పరిశీoచి జిల్లా కలెక్టర్ వివరాలు అడుగగా, గతంలోని 11వేల మొక్కలను కన్వర్షన్ చేసినట్లు, నూతనంగా 10వేల మొక్కలను 12 వేల గ్రీన్ ప్లాంట్ ను, 3వేల500 మొక్కలను హోమ్ సీడ్స్ ను నర్సరీలో పెంచుతున్నట్లు, మలబారు మొక్కలను రైతులు విరివిగా నాటాలని, మీటర్ కు పైన పొడవున్న మొక్కలను నాటాలని, హోమ్ సీడ్స్ పంపిణీ చేసే మొక్కలు 1 ఫీట్ నుంచి 2 ఫీట్స్ ఎత్తు ఉండాలని, వన సేవక్ సరితను ఏప్పటివరకు జీతభత్యాలు అందాయని, పేస్లిప్ తీసుకుంటున్నారా లేదా అని, కచ్చితంగా పేస్లిప్ అడిగి మరీ తీసుకోవాలని తెలిపారు. గ్రామ హరితహారం నర్సరీ నిర్వహణ ప్రశంసనీయం అని సర్పంచ్ సోమలక్ష్మి ని శాలువా కప్పి అభినందించారు. ఆశ వర్కర్ ను వైద్య సేవలు ఎలా అందుతున్నాయని, గ్రామంలో ఎంత మంది గర్భిణీలకు, బాలింతలకు సేవలు ఎలా అందుతున్నాయని అడిగారు, గ్రామంలోనీ అంగన్వాడీ కేంద్రాలు మినీ అంగన్వాడీ కేంద్రం లో అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి సేవలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు.

గ్రామంలో ఉపయోగంలో లేని బావిని మూసి వేయాలని గ్రామస్థులు కోరగా, ఎన్ఆర్ఈజీఎస్ లో ఎస్టిమేట్ చేసి పూడ్చి వేసి గ్రామ పంచాయితీ ఆధీనంలోకి తీసుకొని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సిగ్రిగేషన్ షెడ్ ను పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్ ను వాడాలని, గ్రామం నుండి చెత్త సేకరించి సెగ్రిగేషన్ షెడ్ కు ట్రాక్టర్ ద్వారా తరలించి, తడి, పొడి చెత్త నుండి ఆదాయం వచ్చేటట్లు చూడాలని, గ్రామంలో మురికి గుంటలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయని, మురికి గుంటలు లేకుండా చూడాలని తెలిపారు.

పల్లె ప్రగతి లో 702 గృహాలకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను, రోడ్ల పరిశుభ్రత గ్రీన్ ప్లాంటేషన్, త్రాగునీరు, మురికి కాల్వలను గుంతలను శుభ్రపరచడం సమస్యలను గ్రామ సభల ద్వారా 15 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా గ్రామ రూపురేఖలు మారే విధంగా గ్రామ పౌరులు కృషిచేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, ఆర్డీవో రమేష్, డిప్యూటీ సి. ఈ. ఓ. నర్మద, ఎంపిడిఓ కుమార్, తహసిల్దార్ రాఘవరెడ్డి టీఎస్ ఎన్పీడీసీఎల్ బి ఈ శ్రీధరాచారి, మిషన్ భగీరథ డి.ఈ., ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ వెంకటేశ్వర్ రెడ్డి, డి.శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి డివిజన్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post