గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన         తేది05.11.2021 వనపర్తి

గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో జరిగిన మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారుల తో మాట్లాడారు. వనపర్తి జిల్లాలో   970 క్లైమ్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. గ్రామాలలో ఎంపీవో  ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీలలో  10 నుంచి 15 మంది వరకు సభ్యులను కమిటీ లో నియమించుకోవాలని కోరారు. ఈనెలలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అటవీ హక్కుల కమిటీ సభ్యులను పారదర్శకంగా ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు. కమిటీలో ఎస్టీలు ఉండాలని చెప్పారు.
మహిళలు యం. పి.టి.సి, జెడ్.పి. టి.సి.లు  ఉండేవిధంగా చూసుకోవాలని తెలిపారు. మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్, జిల్లా లెవల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్హతగల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామ సభలలో ఇకముందు అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని. గ్రామ కమిటీ సభ్యులకు సందేహాలు ఉంటే మండల అటవీ హక్కుల కమిటీకి తెలియజేసి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా అటవీశాఖాధికారి రామకృష్ణ ,ఎంపీవోలు, తహసీల్దార్లు, డి ఎల్ పి ఓ,   సర్వేయర్లు,  , మండల స్థాయి అధికారులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. .. జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయబడింది.

Share This Post