గ్రామాల్లో కంచలేని ట్రాన్స్ ఫార్మర్ లను గుర్తించి కంచెల తో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టాలి : జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి.

కంచలేని ట్రాన్స్ ఫార్మర్ లు ఉండకూడదు

మే 15 లోపు జిల్లాలోని 16 చెక్క డ్యాములు పూర్తి కావాలి

మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

గ్రామాల్లో కంచలేని ట్రాన్స్ ఫార్మర్ లను గుర్తించి కంచెల తో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం పల్లె ప్రగతి , విద్యుత్తు, మిషన్ భగీరథ, , మన ఊరు మన బడి, సిసి రోడ్లు , జాతియ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై ఎంపీడీవోలు, ఎంపీపీలు, ఏపీవోలతో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు ప్రమాదాలు నివారించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు, పశువుల గాని ప్రమాద ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ విద్యుత్ అధికారులు ఆదేశించారు. వర్షాకాలంలో విద్యుత్ స్తంభాల మూలంగా ప్రమాదాల పొంచి ఉంటాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని తుప్పు పట్టిన, వంగిన, లూజుగా ఉన్న స్తంభాలను గుర్తించేందుకు ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి వాటిని సరి చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యుత్ ప్రమాదాలతో ఏవైనా అనుకొని సంఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధిత అధికారుల బాధ్యత వంచవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో రెండు కిలోమీటర్ల మించకుండా రోడ్ల నిర్మాణం పారిశుద్ధ్య , ఇరిగేషన్ కాలువల పనులను తప్పకుండా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చేపట్టే 16 చెక్కడా ఏమైనా పనులను మీ 15 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న, పాడైపోయిన ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ రోడ్ల మరమ్మత్తు పనులను చేపట్టాలని సంబంధ అధికారులకు కలెక్టర్ సూచించారు.
ప్రతి గ్రామంలో జనాభా ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని అందించాలని, రాణి గ్రామాలను గుర్తించి నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కాలనీకి సమానంగా నీరు వెళుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి నల్లాకు ఫ్లో కంట్రోల్ వాల్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఎవరైనా తీసివేస్తే వారిపై చర్యలు తీసుకొని వారిపై అపరాధ రుసుము వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి పైపులకు ఏవైనా లీకేజీలు ఉంటే గ్రామపంచాయతీలు సరి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులన్నింటినీ ఎంపీడీవోలు ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని ఏప్రిల్ మాసాంతం లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తికానట్లయితే చర్యలు పవన్ కలెక్టర్ హెచ్చరించారు. గ్రామాలలో ఆస్తి పన్నులను 100 శాతం వసంత్ వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిపిఓ తరుణ్ కుమార్, జెడ్పి సీఈవో జానకి రెడ్డి, డీఈవో రేణుకాదేవి, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్, ఎస్పిడిసిఎల్ ఎస్. ఇ దేవరాజు , అడిషనల్ డిఆర్డిఓ స్టీవెన్ నిల్ లు పాల్గొన్నారు.

Share This Post