గ్రామాల్లో కూలీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబందిత అధికారులను ఆదేశించారు

పత్రికా ప్రకటన*  నల్గొండ, నవంబర్ 3.  గ్రామాల్లో కూలీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి                 సహాయక పథక సంచాలకులు, మండల పరిషత్ అభివృద్ధి  అధికారులు, మండల పంచాయత్ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులు, ఏ.ఈ.(పీ.ఆర్.లు), పంచాయితీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించి వైకుంఠదామాల పురోగతి, నర్సరీల పురోగతి మరియు లేబర్ మొబిలైజేషన్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయితీలో 30 మందికి తక్కువ కాకుండా కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని అన్నారు.
 గ్రామపంచాయితీలలో  ఫాంపాండ్ కానీ లేదా  ఫిష్ పాండ్ పని కానీ ప్రారంభించి ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని  యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లను ఆదేశించారు.
 గ్రామపంచాయితీ నర్సరీలలో పాలీథీన్ సంచులలో మట్టి నింపుట,సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్,ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట నవంబర్ 10 లోపల పూర్తిచేయాలని  ఆదేశించారు .తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి గ్రామపంచాయితీకి 15000 మొక్కల చొప్పున మండల లక్ష్యం సాధించే విధంగా నర్సరీలలో మొక్కలు పెంచాలని కోరారు.
 జిల్లాలో పురోగతిలో మిగిలి ఉన్న అన్ని వైకుంఠదామాలను నవంబర్ 20 లోపల పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్   యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు, ఏ.ఈ.(పీ.ఆర్.లు) లను ఆదేశించారు. జిల్లాలో పురోగతిలో మిగిలి ఉన్న అన్ని సేగ్రిగేషన్ షెడ్లు నవంబర్ 10 లోపల  పూర్తిచేయాలని  అన్నారు.ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో  అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్ శర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా పంచాయత్ అధికారి విష్ణువర్ధన్, ఈ.ఈ.(పీ.ఆర్.) మాధవి తదితరులు పాల్గొన్నారు

Share This Post