గ్రామాల్లో పారిశుద్ధ్యం పకడ్బందీగా చేపట్టాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 4:

గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.  5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ బోనకల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ముష్టికుంట గ్రామంలో పర్యటించి, వీధి వీధి కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. చెత్త సేకరణ, సేకరించిన చెత్త తరలింపు ప్రక్రియ ఏ రోజు కారోజు చేయాలన్నారు. చెత్తను ప్రతి రోజు తరలించకపోవడంతో కాల్చి వేయడం జరుగుతుందని, ఇది మంచిది కాదని ఆయన తెలిపారు. అవసరమైన చోట అదనంగా వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ నీటికి గాను లీకేజీలతో ఇబ్బందులు కల్గుతున్నట్లు, గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి, కొత్త పైప్ లైన్ కొరకు చర్యలు చేపట్టాలన్నారు. సైడు కాల్వలు శుభ్రపరచాలని, నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. మొక్కలు నాటుటకు గుంతలు సిద్దం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఖాళీ స్థలాల్లో ఆయా స్థల యజమాని అంగీకారంతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేయాలని, దీంతో ఆయా స్థలాలు శుభ్రంగా ఉండడంతో పాటు రక్షించబడతాయని, స్థల యజమానులు నిర్మాణాలు చేపట్టే సమయంలో తిరిగి వారి స్థలం వారికి అప్పగించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. గ్రామంలోని నర్సరీని కలెక్టర్ తనిఖీ చేశారు. నర్సరీలో ఖాళీ బ్యాగులు ఉన్నట్లు, ఖాళీ బ్యాగుల్లో విత్తనాలు మొలకించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైమరీ బెడ్స్ లో మొక్కలు సిద్ధం చేయాలన్నారు. వైకుంఠదామం, సెగ్రిగేషన్ షెడ్ వినియోగంలో ఉండాలన్నారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనంలో గ్యాప్స్ ఉన్నచోట మొక్కలు నాటాలన్నారు. రైతు వేదికను సందర్శించి, అక్కడి రైతులతో కలెక్టర్ సంభాషించారు. రైతు వేదికలో ప్రజలతో కలెక్టర్ సమావేశమయ్యారు. వ్యవసాయ విస్తరణ అధికారి, రైతు వేదిక వద్దకు వచ్చిన రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటే, క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారికి రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి వస్తున్నదీ లేనిది అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు చేయవద్దని, దీనికై శిక్ష తప్పదని ఆయన తెలిపారు.
అనంతరం కలెక్టర్ బోనకల్ మండల కేంద్రంలో పర్యటించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి కార్యాచరణను పరిశీలించారు. పిల్లర్ పిల్లర్ కి మధ్యలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అట్టి స్థలంలో బస్ బే, గ్రీనరీ, చిన్న పిల్లల ఆటస్థలం, ఓపెన్ జిమ్, సులబ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్రిడ్జి కి రంగులు వేసి సుందరంగా చేయాలన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి కార్యాచరణ మండల కేంద్ర రూపురేఖలు మారాలని కలెక్టర్ అన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంలో జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, డిపివో జె. హరిప్రసాద్, డీఎల్పీవో ఆర్. పుల్లారావు, మండల తహసీల్దార్ ఆర్. రాధిక, ఎంపిడివో జి. శ్రీదేవి, మిషన్ భగీరథ ఏఇ వై. శ్రీనివాసరావు, పీఆర్ ఏఇ ఎం. నవీన్ కుమార్, ఏఇఓ డి. కల్యాణి, జెడ్పిటిసి సుధీర్ బాబు, ముష్టికుంట సర్పంచ్ షేక్ బీ జాన్ బీ, బోనకల్ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post