గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ పంచాయతీ అధికారులను ఆదేశించారు.

గురువారం డిఆర్డిఓ సమావేశపు హాలులో అటవీ, పంచాయతీ, జడ్బీ, డిఆర్డిఓ, యంపిడిఓ పిఓ, ఏపిఓలతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, వర్మికంపోస్టు తయారు, వైకుంఠదామాలు, నర్సరీలు, నిర్వహణ, పల్లె, బృహత్ పల్లెపకృతి వనాలు, హరితహారం, ట్రాక్టర్లు రుణ చెల్లింపులు, సిసి చార్జీలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యంపిటలు కార్యస్థానాల్లో ఉండాలని చెప్పారు. కార్యదర్శులపై పర్యవేక్షణ లోపం వల్ల పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, చెత్త సేకరణలో అనుకున్నంత ఫలితాలు రావడం లేదని ఆయన తెలిపారు. కార్యదర్శులు ఉదయం 8 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యర్ధాల సేకరణను పరిశీలన చేయాలని చెప్పారు. కార్యదర్శుల పర్యవేక్షణలోపం వల్ల వ్యర్థాల సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. మాట వినని కార్యదర్శులను తొలగించి ఇతరులను నియమిస్తామని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులే ప్రధానమైన వ్యక్తులని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల్లో వర్గాలు సేకరణకు ఉదయం 7 గంటలకే ట్రాక్టర్లు గ్రామాలకు వెళ్లాలని, జిపిఎస్ ద్వారా ట్రాక్టర్లు నిర్వహణను పరిశీలన చేస్తామని చెప్పారు. 481 పంచాయతీల్లో కేవలం 200 ట్రాక్టర్లు మాత్రమే 7 గంటలకు చెత్త సేకరణ చేస్తున్నాయని ఇక ముందు ఉపేక్షించనని చెప్పారు. పంచాయతీ పరిధి దాటిన ట్రాక్టరుకు రిమార్కులు రాయాలని యంపిటలను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా . నిర్వహించినపుడే చెత్త సేకరణ జరుగుతుందని, తద్వారా గ్రామాలు స్వచ్ఛతను సంతరించుకుంటాయని ఆయన వివరించారు. పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదును డిఎస్ఆర్ ద్వారా పరిశీలన చేస్తామని, సమయపాలన పాటించకుండా అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరణించిన వ్యక్తుల అంతిమ కార్యక్రమాలు నిర్వహణకు ప్రతి పంచాయతీలో వైకుంఠదామాలు నిర్మించామని, వైకుంఠదామాలు వినియోగంలో పర్యవేక్షణ కొరవడినట్లు కనిపిస్తున్నదని సర్పంచుల సహాకారంతో అంతిమ కార్యక్రమాలు వైకుంఠదామాల్లో నిర్వహించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బృహత్ పల్లె పకృతి వనాల్లో మొక్కల సంరక్షణకు డ్రిప్ ఏర్పాటు చేయాలని, బోరు వేయడం ఎంత పని ఎందుకు జాప్యం చేస్తున్నారని యంపిఓలను ప్రశ్నించారు. బృహత్ పల్లె. పకృతి వనాలు ఏర్పాటు ద్వారా చిట్టడవులు ఏర్పడతాయని, ప్రజలు ఆహ్లాదం కొరకు వెళ్తుంటారని చెప్పారు. బృహాత్ పల్లె పకృతి వనాల సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. రహదారులపై వ్యర్ధాలు కనిపిస్తుంటే మీకు కనిపించడం లేదా వ్యర్ధాలు ఇలా రోడ్ల మీద ఉంటే ఇంకేమి పారిశుద్య కార్యక్రమాలు జరుగుతున్నట్లని అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారుల వెంబడి వ్యర్ధాలున్నాయని కలెక్టర్ చెప్తే తప్ప మీకు కనిపించట్లేదా అంటూ ఆగ్రహం. వ్యక్తం చేస్తూ గ్రామాలను జల్లెడపట్టి పరిశుభ్రం చేయాలని చెప్పారు. వ్యర్ధాలను కాల్చుతున్నారని, వ్యర్థాలు కాల్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారుల వెంబడి పిచ్చి మొక్కలను తొలగించాలని చెప్పారు. ప్రతి ఇంటి నుండి వ్యర్థాల సేకరణ జరగాలని, వ్యర్థాలు వేసేందుకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ తొలగించాలని, చెప్పారు. వ్యాధి నియంత్రణకు వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి. అపోహలుంటే తొలగించాలని, ప్రజలు నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతం చేసి నూరు శాతం పూర్తయిన గ్రామాలను, మండలాలను వ్యాక్సినేషన్ జరిగినట్లు ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎఫ్ఎ రంజిత్, డిపిఓ రమాకాంత్, జడ్పీ సిఈఓ విద్యాలత, డిఆర్డిఓ మధుసూదనాజు, ఉద్యాన అధికారి మరియన్న, అన్ని మండలాల యంపిడిఓలు, యంపిఓలు, ఏపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post