గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి

గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి

100% పోస్టల్, బ్యాంక్ ఖాతాలు తెరవాలి


దేవీలు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

     గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం నంగునూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది కార్పొరేట్ కు దీటుగా వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి- మన బస్తి మనబడి కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ పోస్టల్, బ్యాంకు ఖాతాలు తెరవాలని, డీజిల్ లావాదేవీలు నిర్వహించాలని అన్నారు. గ్రామంలో మెరుగైన సౌకర్యాల కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. నగునూరు గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని యూబిఐ బ్యాంక్ అధికారులను కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందించిన కంపాస్ బాక్సులను విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ ఉప్పల శ్రీధర్, ఎంపిటిసిలు వినయ్ సాగర్, శ్రీనివాస్, తహసీల్దార్ వెంకట్ రెడ్డి, యు బిఐ డిజియం కుమార్, ఏజీఎం వంశీకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ కిషోర్ కుమార్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post