గ్రామాల అభివృద్ధికి ఉపాధిహామి పథకం పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల కమిషనర్ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు

. శనివారం డిఆర్డిఓ సమావేశపు హాలు నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం పనులపై యంపిడిఓలు, యంపిఓలు, ఏపిఓలు, ఈసిలు, టిఏలతో నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో రోజు 5 నూతన జాబ్‌కార్డులు జారీ చేయాలని చెప్పారు. నిరుపేద కుంటుంబాలకు చెందిన కుటుంబాలకు చెందిన వ్యక్తులకు జాబ్‌కార్డు జారీ చేయడం వలన 100 రోజుల పనులు లభించడంతో జీవనోపాధిని కల్పించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. క్షేత్రస్థాయి నుండి డిఆర్డిఓ, డిపిఓ, సిఈఓ సమన్వయంతో ఒక టీముగా పనిచేయాలని చెప్పారు. సమన్వయంతో చేయడం వల్ల పనులు వేగంగా జరగడంతో పాటు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. నిరుపేద కుటుంబాలున్న ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధిపనులను చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ఫీల్డ్ మాన్స్ కార్యదర్శులేనని, ఉదయమే విధులకు హాజరవడం వలన గ్రామాల్లో నిర్వహించు పారిశుద్య కార్యక్రమాలు, విద్యుత్, మంచినీరు సరఫరా, వ్యర్ధాలు సేకరణ పర్యవేక్షణ మంచిగా జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలు సంరక్షణకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోయాలని, దీని ద్వారా ఉపాధిపనులు క్రింద పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రానున్న హరితహారంలో పెద్ద పెద్ద మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కలు పెంపకాన్ని చేపట్టాలని చెప్పారు. మొక్కల సంరక్షణ 95 శాతం ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటిలో ప్రజలు గ్రాఫ్టింగ్ మొక్కలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. హరితహారంలో ప్రతి ఇంటికి పంపిణీ చేసిన ఆరు మొక్కల సంరక్షణను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రతి కార్యాలయం హరిత కార్యాలయం కావాలని చెప్పారు. గ్రామాల్లోని ప్రతి రహదారి మొక్కలతో నిండిపోవాలని, మొక్కలు లేని రహదారి అంటూ ఉండకూడదని, ప్రతి రోడ్డు మొక్కలతో నందనవనం కావాలని చెప్పారు. మొక్కలను చిన్న పిల్లలు లాగా కాపాడుకోవాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షణలో యంపిఓలు చాలా క్రియాశీలకమైన వ్యక్తులని, యంపిఓల నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. సమాజంలో మనకంటే తెలివి కలిగిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు కానీ ఉద్యోగ అవకాశం మనకు మాత్రమే వచ్చిందని, వచ్చిన అవకాశంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ప్రతి బుధవారం మండలస్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. లేబర్‌బడ్జెట్, మొక్కలు జియో ట్యాగింగ్, పల్లె పకృతి వనాలు ఏర్పాటు, అవెన్యూ ప్లాంటేషన్, డంపింగ్యార్థులు వినియోగం పంట కల్లాలు నిర్మాణంలో జిల్లా ప్రధమస్థానంలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. పల్లెలు బావుండాలని, పల్లెలు అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో ఎన్ని ఇబ్బందులున్నా. ప్రతి నెలా ప్రతి నెలా క్రమం తప్పక నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకమైన శాఖని చెప్పారు. పల్లెల్లో మార్పులు రావాలన్న ధ్యేంతో ప్రభుత్వం అన్ని ఖాళీలను పూర్తి చేసిందని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో కీలకమైన వ్యక్తులం మనమేనని కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేస్తుంటే ఫలితాలు వాటంతట అవే వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహణతో గ్రామాల్లో అనూప్యమైన మార్పు వచ్చిందని, పారిశుధ్యం లేకపోవడం వల్ల గతంలో డెంగీ, మలేరియా కేసుల్లో వేలల్లో నమోదయ్యాయని, నేడు పల్లె ప్రగతి కార్యక్రమంలో వ్యాధులను బాగా తగ్గించగలిగామని చెప్పారు. కార్యక్రమం నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. పల్లెల అభివృద్ధి అనేది మీ చేతుల్లోనే ఉందని, బాగా పనిచేస్తున్న సిబ్బందిని గౌరవిస్తూనే పనిచేయని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సిబ్బంది సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు పోవాలని, కొందరు కాదు అందరూ కృషి చేయాలని చెప్పారు. అభివృద్ధి సాధించడానికివనరులు మెండుగా ఉన్న ఈ జిల్లాలో దేశస్థాయిలో ప్రధమర్యాంకు సాధించిన అనుదీప్ కలెక్టర్ ఉండటం చాలా మంచి పరిణామనని అతని సేవలు ఈ జిల్లాకు చాలా అవసరమని చెప్పారు. బృహత్ పల్లె పకృతి వనాలు గురించి ప్రస్తావిస్తూ 22 కి గాను 18 బృహత్ పల్లె పకృతి వనాలు ఏర్పాటు జరిగిందని, మిగిలిన 4 బృహత్ పల్లె పకృతి వనాలను సత్వరం పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం కమిషనరు సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు.

 

ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్‌రాజు, సిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, అన్ని మండలాల యంపిడిఓలు, యంపిఓలు, ఏపిఓలు, ఈసిలు, టిఏలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post