గ్రామాల పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు

సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని కోరారు. గ్రామాల్లోని రోడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. అపరిశుభ్రత పరిసరాలు లేకుండా చూడాలని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు, వైకుంఠ ధామాలు వినియోగంలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ సజావుగా జరిగే విధంగా చూడాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా సర్వే బృందాలు త్వరలో గ్రామాలను పర్యటిస్తారని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు. —————- జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే

Share This Post