గ్రామాల వారీగా దళిత బంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 25లోగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల సంఖ్యను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం కు 100 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. గ్రామ పంచాయతీల వారీగా జ్వరం సర్వే పూర్తిచేయాలని సూచించారు. లక్షణాలు ఉన్న వారి వివరాలు జిల్లా స్థాయి అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డి ఆర్ డి ఓ వెంకట మాధవరావు, జెడ్ పి సీఈవో సాయా గౌడ్, ఉపాధి హామీ ఏపీడీ శ్రీకాంత్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారీ చేయనైనది.

Share This Post