గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని విధ్యుత్,నీటి సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని  విధ్యుత్,నీటి సమస్యలను  పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

0 0 0 0

            గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యూత్, నీటి సమస్యలు అధికంగా వస్తుంటాయని వాటిని పరిష్కరించడంతో పాటు తిరిగి అట్టి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

        శనివారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో  పల్లె, పట్టణ ప్రగతి పై సంబంధిత  శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వైకుంఠదామాలు, పాఠశాలలు మరియు అంగన్వాడీలకు నీటి సరఫరా అందించాలని, నీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నట్లయితె అక్కడ బోర్ వెల్ ద్వారా నీటిని అందించేలా చర్యలు అన్నారు.  తుప్పుపట్టిన, వంగిన, విరిగిన కరెంట్ పోల్స్  ను తొలగించాలని,  లూస్ వైర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  స్మార్ట్ సిటిలో ఎటువంటి విద్యూత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని దీనికై విద్యుత్ శాఖ డిఈ రాజిరెడ్డిని నోడల్ అధికారిగా నియమించడం జరుగుతుందని పేర్కోన్నారు.   విద్యూత్ వైర్ల క్రింద ఉన్న చెట్ల కొమ్మలను కోట్టెముందు మున్సిపల్ అధికారులకు సూచించాలని, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేసిన కంచే వద్ద పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని ఆధికారును ఆదేశించారు.  అన్ని వైకుఠదామాలకు  వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వినియోగించాలని 400 మీటర్ల దూరంలో ఉన్నట్లయితె పోల్స్ ఎర్పాటు చేయాలని అన్నారు.  నీటి సౌకర్యం ఉండేలా చూడాలని వాటి బిల్లులను గ్రామపంచాయితి చెల్లిస్తుందని పేర్కోన్నారు.  విద్యూత్, నీరు నిత్య జివితంలో కచ్చింతంగా అవసరమని వాటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత  శాఖలు సమన్వయంతో కలిసిపనిచేసినప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామని తెలిపారు.అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామపంచాయితి నుండి పట్టణం వరకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

     ఈ సమావేశంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ కమీషన్ సేవఇస్లావత్, డిపిఓ వీరబుచ్చయ్య, విద్యూత్, మున్సిపల్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎపియం లు పాల్గోన్నారు.

Share This Post