గ్రామీణాభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి. నూతన క్యాలండర్ ఆవిష్కరణ. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో గ్రామీణాభివృద్దే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ నందు నూతన సంవత్సర క్యాలండర్, గోడ పత్రికను పి.డి. డి.ఆర్.డి.ఏ  యస్. కిరణ్ కుమార్ తో కలసి ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్దే దేశాభివృద్దని ఆదిశగా తమ శాఖ ద్వారా జిల్లాలోని  గ్రామ, మండల స్థాయిలలో అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ముఖ్యoగా కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా  గ్రామాలలో అవగాహన కల్పించాలని అన్నారు.
   ఈ కార్యక్రమంలో ఏ పిడి లు రాజు, dr. పెంటయ్య, డి.ఆర్.డి.ఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post