గ్రామీణ క్రీడా మైదానాలను యువకులు, ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

గ్రామీణ క్రీడా మైదానాలను యువకులు, ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్ధo

గ్రామీణ క్రీడా మైదానాలను యువకులు, ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తానం చర్ల,
మరిపెడ మండలం
మహబూబాబాద్ జిల్లా, జూన్ -08:

గ్రామీణ క్రీడా మైదానాలను యువకులు, ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక కోరారు.

5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా
బుధవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి మరిపెడ మండలం తానం చర్ల గ్రామంలో పర్యటించి, ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా మైదానం ను పరిశీలించారు. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని యువకులను కోరారు. రెండు ఎకరాల్లో ఏర్పాటు చేసిన క్రీడామైదానంలో పనులను, ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించారు.

క్రీడా మైదానంలో ఇరుగు వారితో హద్దులను సరిగా చూసుకోవాలని, ఉన్న ప్రదేశం వైపు హద్దులు ఏర్పాటు చేసి 60 మీటర్ల మేర ఫెన్సింగ్ చేయాలని, వైకుంఠధామం వాడకంలోకి వచ్చిందా, కరెంటు మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారా లేదా అని కలెక్టర్ అడుగగా వైకుంఠధామం వాడకంలోకి వచ్చిందని కరెంట్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదని, ఎరువుల ద్వారా 396 రూపాయలు, ఈజీఎస్ వాటరింగ్ ద్వారా 2లక్షల 80 ఆదాయం వచ్చిందని, 326 కుటుంబాలు,1065 జనాభా ఉందని అధికారులు తెలిపారు. ప్రతిరోజు 150 గృహాలల్లో చెత్త సేకరణ రోజు విధిగా జరగాలని, కరెంట్ , నీటి వసతి వెంటనే ఏర్పాటు చేయాలని సెగ్రిగేషన్ ద్వారా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఎరువులుగా మార్చి పంచాయతీకి ఆదాయం సమకూరేచ్చేటట్లు చూడాలని, గతంలో అందజేసిన తడి, పొడి చెత్త డబ్బాలు పూర్తిస్థాయిలో వాడుకునేట్లు చూడాలని తెలిపారు.

5వ విడత పల్లె ప్రగతిలో గ్రామాల్లో పూర్తిస్థాయిలో పనులను నిర్వహిoచి, వ్యవస్థను, గ్రామాలను బాగు చేసుకోవాలని, గ్రామ సభ ద్వారా గతంలో చేసిన పనులు ప్రతి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అవసరమగు పనులను నిర్ణయించుకోవాలని, ట్రై సైకిల్స్, ట్రాక్టర్, వీధుల్లో సిమెంటు రింగుల ద్వారా ప్రతి రోజు విధిగా చెత్త సేకరణ జరగాలని, నెలలో 2 రోజులు అదనంగా కూలీలను ఏర్పాటు చేసుకుని పనులను చేపట్టాలని అన్నారు.

తానం చర్ల గ్రామం నుండి గర్భిణీలు అధికంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి పెద్దాపరేషన్ ల ద్వారా డెలివరీలు చేసుకొని ఆదాయాన్ని, జీవన ప్రమాణాన సగటు ను తగ్గించుకుంటున్నారని, పేదలు 100% ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవం జరిగేట్లు ఏఎన్ఎం, ఆశాలు వైద్య సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్ సెంటర్ లో ఇద్దరు ఏఎన్ఎంలు, 9 మంది ఆశాలు ఏం చేస్తున్నారని, జిల్లా లో మరిపెడ డోర్నకల్ లో విపరీతంగా ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్ లు జరుగుతున్నాయని వాటిని పూర్తి స్థాయిలో అరికట్టాలని అధికారులను కోరారు. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు సబ్ సెంటర్లో విధులు నిర్వహించాలని తాళం వేసినట్లు సబ్ సెంటర్ కనబడ కూడదని, గ్రామoలో ఉన్న ముగ్గురు గర్భిణీ లను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగేలా చూడాలని, ఐ సి డి ఎస్ ఆరోగ్య లక్ష్మి, వైద్యశాఖ ఏ ఎన్ ఎం సి, డాటా వేరు వేరుగా ఉండకూడదని ప్రతినెల అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు, సమీక్షలు జరపాలని, గ్రామంలోని ఓ హెచ్ ఆర్ కొత్త వాటర్ ట్యాంక్ కు వారంలోగా నీరును ఎక్కించాలని, మండలంలోని ఆదర్శ గ్రామాలైన పురుషోత్తమాయ గూడెం, అబ్బాయి పాలెం లో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చెయ్యాలని, క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయవలసిన పనులు వెంటనే పూర్తిచేయాలని ప్రజా ప్రతినిధులను, అధికారులకు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ, జెడ్పిటిసి శారద, సర్పంచ్ శ్వేత, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ టి సుధాకర్, అడిషనల్ డిఆర్డిఓ దయాకర్ రావు, ఆర్ డి ఓ రమేష్, తహసిల్దార్ ఎంపీడీవో ధన్ సింగ్ , మిషన్ భగీరథ డి ఈ స్వామిదాస్, అనూష, పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్ ఏఎన్ఎం విజయ కుమారి, ఆశా గ్రామ ప్రజలు, యువకులు జిల్లా,మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MA

Share This Post