గ్రామీణ క్రీడ ప్రాంగణాలను జూన్ ఒకటో తేదీ లోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు ఆదేశించారు.

గ్రామీణ క్రీడ ప్రాంగణాలను జూన్ ఒకటో తేదీ లోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు ఆదేశించారు.

బుధవారం అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా కంది మండలం కాశీపూర్ లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల లో జరుగుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష పత్రాలను తెరిచే గదీని, పరీక్ష కేంద్రము లో విద్యార్థుల హాజరు మరియు తరగతి గదులలో పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.

అనంతరం కాశీపూర్ గ్రామములో మన ఊరు మన బడిలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభానికి సమయం తక్కువ గా వున్నందున పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యత తో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అంగన్వాడీ , పాఠశాల ఒకే కాంపౌండ్ లో వున్నప్పటికి మధ్యలో ప్రహరీ గోడ నిర్మించడానికి బేస్మెంట్ పనులు చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే పనులు ఆపాలని చుట్టూ ప్రహరీ గోడ ఎత్తు పెంచుటకు అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రహరీ గోడ నిర్మించుటకు కోరిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు.

అంగన్వాడీ , ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల లు ఒకే కాంపౌండ్ లో వున్నట్లైతే ఒకే ప్రహరీ వుండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. మన ఊరు మన బడి లో ప్రభుత్వం నిర్దేశించిన స్టీల్ మరియు సిమెంట్ రకాలను వాడాలని ఆదేశించారు.

అనంతరం కంది మండలం ఇంద్రకరణ్ , సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామ పంచాయతీ లలో నిర్మిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనులను పరిశీలించారు. పనుల ను జూన్ ఒకటవ తేదీ లోపు పూర్తి చేసి జూన్ 2 న ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కంది మండల పరిషత్తు అభివృద్ధి అధికారి రవీందర్ , మండల పంచాయతీ అధికారి మహేందర్ రెడ్డి, సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీ లు పాల్గొన్నారు.

Share This Post