గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు పశు సంవర్థక శాఖ వ్యవసాయ అనుబంధ శాఖల తో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు పశు సంవర్థక శాఖ వ్యవసాయ అనుబంధ  శాఖల తో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. ప్రపంచ పశుసంవర్ధక దినోత్సవం సందర్బంగా  శనివారం పశు సంవర్థక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  పశు సంవర్థక శాఖ సిబ్బంది ఉదయం నుండి వివిధ క్రీడలు నిర్వహించగా విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేసారు.  పశు సంవర్థక శాఖలో సేవలు చేసి రిటైర్డు అయిన డి.డి. సూర్యప్రకాష్ లింగాల వాసికి సన్మానం చేసి మెమోంటో ప్రధానం చేశారు. సిబ్బందికి ప్రపంచ వెటర్నరీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం వ్యవసాయం మీదనే ఎక్కువ దృష్టి సారించడం జరిగిందని కానీ రైతు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయం తో పాటు పశు పోషణ అవసరమన్నారు.  కాబట్టి ఇకనుండి పశు సంవర్థక శాఖ సిబ్బంది వ్యవసాయ విస్తీర్ణాధికారులతో కలిసి పని చేయాలని రైతు వేదికలను వాడుకొని ఏ రకమైన పశువులకు ఎలాంటి జబ్బులు వస్తాయి వాటికి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ ఇస్తారు అనే వివరాలు పెట్టాలని అక్కడికి వచ్చే రైతులకు లాభసాటి పశుపోషణ పై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు.  పశు సంవర్థక శాఖకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు.  వ్యవసాయ అనుబంధ రంగాలు అన్ని సమిష్టిగా సమన్వయంతో పనిచేసి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహడ్పడాలని సూచించారు.

అంతకుముందు పశు సంవర్థక శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, ఇప్పటి వరకు చేసిన    జంతువుల సర్జరీలు, సిబ్బంది వివరాలు ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.   ఈ సందర్బంగా పశు సంవర్థక శాఖ అధికారి డా. జి.వి. రమేష్  మాట్లాడుతూ అనాదిగా  మనుషులు జంతువులను మచ్చిక చేసుకొని జీవిస్తున్నారని, మనిషికి కావలసిన ప్రోటీన్ లు మాసం, పాలు, గుడ్ల ద్వారా అందుతాయని అలాంటి ప్రోటీన్లు ఇచ్చే పశు సంపదకు నోరు లేని జీవాలకు  తమ శాఖ సేవలు చేయడం గొప్ప వరంగా భావిస్తామన్నారు.  తమ బాధలు చెప్పుకోలేని జీవాలకు వైద్యం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తామన్నారు.   ప్రపంచ వెటర్నరీ దినోత్సవం సందర్బంగా వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది పునర్ శక్తి క్రోఢీకరించుకొని నుతనుత్తేజం తో పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. ఈ సందర్బంగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఏక కాలంలో వేల మందికి సమాచారం వెళ్లే కమ్యూనికేషన్ సిస్టమ్ ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లో జిల్లాలోని వేల మంది గొర్రెల కాపరులు, పౌల్ట్రీ, పశు పోషకుల ఫోన్ నెంబర్లు నిక్షిప్తం అయి ఉన్నాయని పశువుల సంరక్షణకు ఇచ్చే సమాచారం మాటల రూపంలో  అందరికి ఒకేసారి వెళ్లిపోతుందన్నారు. ఈ సిస్టం రాష్ట్రంలోనే మొదటిసారిగా నాగరకర్నూల్ జిల్లాలో నేడు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రిటర్డు డి.డి.  సూర్య ప్రకాష్, జిల్లా అధికారులు, వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post