గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దే దేయ్యం:: గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రెస్ రిలీజ్.
తేది.4.6.2022.
ములుగు జిల్లా.

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దే దేయ్యం:: గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

00000

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు
శనివారo గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనంను, క్రీడా ప్రాంగణాన్ని, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ లతో కలసి గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బృహత్ పల్లె ప్రకృతి వనం 8 ఎకరాల విస్తీర్ణంలో 5వేల 440 వివిధ రకాల మొక్కలతో సుందరికరించారని అన్నారు. పల్లె ప్రకృతి వనంలోని వాకింగ్ ట్రాక్ ను, సుందరంగా తీర్చిదిద్ది త్వరలో గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనీ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, యువత శారీరకంగా, మానసిక ఉల్లాసం తో దృఢంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తెలంగాణ క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేయాలని సూచించారని, ప్రతి వార్డులో, గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగనాలను సద్వినియోగం చేసుకుని యువత క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. మంత్రి పల్లె ప్రకృతి వనంలో జాతీయ ఉపాది హామీ పథకం క్రింద పనిచేస్తున్నా కులీలతో కాసేపు ముచ్చట్టించారు. క్రీడా ప్రాంగణoలో వాలీబాల్ ఆడుతూ అందరిని ఉత్సాహ పరిచారు.

అనంతరం మంత్రి గోవిందరావు పేట చల్వాయి గ్రామంలోని గౌరారం గడ్డ వద్ద, ములుగు మండలం లోని ఇంచెర్ల గ్రామం గట్టమ్మ దేవాలయం సమీపంలో 1 లక్ష 50 వేల సమగ్రగిరిజనాభివృద్ధి సంస్థ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ కిచెన్ షేడ్లను(వంట శాల భవనాలకు) శంకుస్థాపన చేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ఇలా త్రిపాఠీ, డిఆర్ఓ రమాదేవి, డీఆర్డీఓ వెంకట నారాయణ, జడ్పీ సీఈవో రమాదేవి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పళ్ళ బుచ్చయ్య, డిపివో వెంకయ్య, ఎంపిడివో , తహసీల్దార్, తుమ్మల హరిబాబు, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత ఎం పి టి సి నాగలక్ష్మి, చాపల ఉమాదేవి, సర్పంచ్ ఈసం సమ్మయ్య, ఉప సర్పంచ్ హరిబాబు, ఎస్ఎంసి చైర్మన్ సంతోష్, గ్రామైక్య సంఘ సభ్యులు మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post