గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమం

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమం

ప్రజల సంపద పెరగాలని కెసిఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు

జై తెలంగాణ నినాదం తో రాష్ట్రం రావాలని ఇదే  గ్రామంలో కోరుకొన్నo

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000

     గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     శుక్రవారం కరీంనగర్ మండలం లోని చామనపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జై తెలంగాణ నినాదంతో రాష్ట్రం రావాలని ఇదే గ్రామంలో కోరుకున్నాం అని తెలిపారు.ప్రజల సంపద పెరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.  రాష్ట్రం రాకముందు కూడా మనం ఉన్నాం అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నామని అందరం ఆలోచించుకోవాలి అన్నారు.నీళ్లు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకొని అపరిశుభ్రంగా ఉన్న నీటిని తాగే వాళ్ళమని దాని వల్ల కలరా వంటి రోగాల బారిన పడే వాళ్ళం అన్నారు. గతంలో  గ్రామాలు అన్నీ అస్తవ్యస్తంగా ఉండేరోడ్లు, పరిశుభ్రత లేక అనారోగ్యం పాలయ్యాం అన్నారు. సమైక్యా పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యానని నిధులు కావాలని కోరుకుంటే వెకిలిగా నవ్వాడని తెలిపారు.  కానీ నేడు రాష్ట్రం సాధించుకున్నాక గ్రామలన్ని పరిశుభ్రంగా మారాలని ముఖ్యమంత్రి కోరుకున్నారన్నారు.రాష్ట్రం వచ్చి 8 ఏళ్ళలో అనేక నిధులు తెచుకున్నామని,ఈ గ్రామానికి ఆనాడు ఎవరు కూడా అభివృద్ధి చేయలని ఆలోచన కూడా చేయలేదన్నారు.ఆడబిడ్డ పెళ్లి కోసం అష్ట కష్టాలు పడి ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూసి కేసీఆర్ మేనమామగా  లక్ష 116/-రూపాయల సాయం కల్యాణ లక్ష్మీ రూపంలో అందిస్తున్నారని తెలిపారు. కరెంటు కోసం అర్ధరాత్రి వెళ్లి మోటార్లు వేస్తే కాలిపోయే పరిస్థితి ఉండేదని చామనపల్లి లో కరెంట్ కోసం ఆనాడు నేనె ధర్నా చేసానని అన్నారు.  నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమేననిఅన్నారు. మీ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎల్లవేళలు అందుబాటులో ఉంటా..చెరువులు త్వరలోనే నింపుతాం అన్నారు.చెట్లు నరికివేయడం వల్ల వర్షాలు మాయమయ్యాయని తిరిగి వర్షాలు రావాలని హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు.గ్రామాల్లో ఆటలు కనుమరుగయ్యాయి..మళ్ళీ వాటికి పునర్జీవనం రావాలని కేసీఆర్ ఆలోచన చేసి గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసామని అన్నారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీపీ లక్ష్మయ్య గ్రామ సర్పంచ్ లక్ష్మి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post