గ్రామీణ వికాసంతో పాటు వ్యక్తిగత ఆర్థిక స్వాలంబనే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి బృందం తెలిపింది.

గ్రామీణ వికాసంతో పాటు వ్యక్తిగత ఆర్థిక స్వాలంబనే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి బృందం తెలిపింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ చరణ్ జీత్ సింగ్, డైరెక్టర్ ఆర్.పి.సింగ్ తో కూడిన కేంద్ర బృందం శనివారం నాడు బీబీనగర్ మండలంలోని మీదితండా గ్రామాన్ని సందర్శించి గ్రామ సభలో పాల్గొంది. గ్రామసభలో  చేపట్టవలసిన పనులను, ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులను, జాబ్ కార్డులను పరిశీలించింది.
2020-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు అక్టోబర్ 2 వ తేదీ నుండి వచ్చే జనవరి 31వ తేదీ వరకు ఉపాధి హామీ పనులను గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశం.  పూర్తి కాని పనులను పూర్తి చేయడం,  ప్రతి గ్రామపంచాయతీలో సహజ నీటి వనరుల పెంపు, వాటి సంరక్షణ, కందకాలు, ఫాంపౌండ్స్ నిర్మాణం, పచ్చదనం పెంపు, ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్ యాడ్ లలో సేంద్రియ ఎరువుల తయారీ, సహజ వనరుల యాజమాన్యానికి,  నీటి సంరక్షణ పనులకు, ఉమ్మడి భూముల అభివృద్ధి పనులు, చిన్న నీటి కుంటలు, పూడికతీత పనులు, వర్షపు నీటి నిలువ,  కట్టడాలు,  రీఛార్జి కట్టడాలు, సంప్రదాయ నీటి వనరుల సంరక్షణ, జల శక్తి అభియాన్ పనులు చర్చించి ప్రతి గ్రామపంచాయతీలో ముప్పై నీటి సంరక్షణ పనులను ఏర్పాటు చేయడం, గడ్డి పెంపకం, పశువులు మేకల నీటి తొట్ల నిర్మాణం, చేపల ఉత్పత్తి గుంటలు తదితర పనులలో ఉమ్మడి భాగస్వామ్యం కల్పించడం, నర్సరీ సైట్లను ముందే గుర్తించి దానికి సంబంధించిన అవసరమైన ఇతర సామాగ్రి సేకరణ సేకరించడం, అవెన్యూ ప్లాంటేషన్, ఈత ప్లాంటేషన్, మంకీ ఫుడ్ కోర్టులు, హరితవనాల ఏర్పాటుకు అవసరమైన మొక్కలు గుర్తించడం, ప్రతి గ్రామపంచాయతీ నర్సరీలో పదివేల మొక్కలు తప్పనిసరిగా పెంచడం గ్రామ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. గ్రామ సభలో గుర్తించిన పనులను గ్రామ కమిటీ ద్వారా ఆమోదం చేసుకుని, మండల జిల్లా కమిటీల ఆమోదం ద్వారా పనులు చేపట్టడం నిర్వహించాలి.
మీదితండా గ్రామ ప్రజలు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు కేంద్ర బృందం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఉపాధి హామీ పనులలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని సూచించింది. ఉపాధి హామీ పనులలో తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పనులు నిర్వహించాలని కోరింది.
తొలుత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కేంద్ర బృందం పూలమాలలతో ఘనంగా నివాళులర్పించింది.  మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శనను బృందం తిలకించింది.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి జాయింట్ కమీషనర్ ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఉపేందర్రెడ్డి, ఆర్డీఓ సూలజ్ కుమార్, ఎంపీపీ సుధాకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ జయమ్మ, ఎంపిటిసి భీమ్లా,  ఉపసర్పంచ్ పాండు, వార్డు సభ్యులు, ఏపీడి లు, డిపీఎం లు, ఏపీవోలు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post