గ్రామీణ విద్యార్థుల, జిల్లా కాలేజీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం : జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి

Press note. 5.10.2021

గ్రామీణ విద్యార్థుల అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి అన్నారు.

మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కాలేజీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిగ్రీ కళాశాల్లో నైపుణ్యాల కల్పనలో అగ్రగామి ఉంటూ ఉపాధిని అందించే దిశగా గ్రామీణ విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పనిచేయాలని అన్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యా కార్యక్రమాన్ని సమీక్షించి కళాశాలల అధ్యాపకుల బోధనా పద్ధతులను, విద్యా క్రీడా సాంస్కృతిక సేవా రంగాల్లో విద్యార్థులు సాధిస్తున్న విజయాలకు ఆయన అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అవసరమైన వసతులను సమకూరుస్తామని తెలిపారు.

కార్యక్రమానికి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రతినిధిగా విచ్చేసిన ప్రొఫెసర్ కె. అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు బోధన-పరిశోధన ద్విగుణీకృత విద్యా విధానాన్ని అద్భుతంగా చేపడుతున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య వ్యవహరించగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు ప్రిన్సిపాల్ డా. సిహెచ్. సత్యనారాయణ , రామన్నపేట వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ మంజర్ జాఫ్రి, అధ్యాపకులు డా.యాదగిరి, శ్రీకాంత్, ఇందిర, బాలనర్సింహ, నర్సింహ రాజు, అధికారులు పాల్గాన్నారు.

….DPRO. YADADRI.

 

Share This Post