గ్రామ పంచాయతి లో జరుగుతున్న ఉపాది హామీ పనులకు సంబందించిన అన్నివివరాలను రిజిస్టర్ లలో అప్ డేట్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

పత్రికా ప్రకటన                                                                   తేది : 27-08-2021

గ్రామ పంచాయతి లో జరుగుతున్న ఉపాది హామీ పనులకు  సంబందించిన అన్నివివరాలను  రిజిస్టర్ లలో  అప్ డేట్ చేయాలనీ జిల్లా  కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

శుక్రవారం .గద్వాల్ మండలం ముల్కలపల్లి, తెలుగోనిపల్లి, బీరెల్లి గ్రామాలలో (NREGS), ఉపాధి హామీ  పనులను పరిశీలించారు. ముల్కలపల్లి  గ్రామంలోని  వైకుంటదామం ను పరిశీలించి, అక్కడ పని చేసే వాచర్ తో మాట్లాడి , మీకు జాబ్ కార్డు ఉందా, డబ్బులు మీ అకౌంట్ లో వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పంచాయతి కార్యదర్శులతో జాబ్ కార్డ్స్ వివరాలు రిజిస్టర్   గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్తగ జాబ్ కార్డ్    కోసం వచ్చిన  దరకాస్తులను పరిష్కరించాలని,తప్ప కుండా జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయాలనీ,  ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరితో జాబ్ కార్డు ఉండేలా చూడాలని అన్నారు. జాబ్ కార్డు ఉన్న వారికి డబ్బులు వారి ఖాతాలోకి జమ అవుతున్నాయ లేదా అని తెలుసుకున్నారు. రోజుకి ఎంత వర్క్ జరుగుతుందని, ఎంత మంది పని చేస్తున్నారని, లేబర్ పేర్లు , లేబర్ కు రోజు వారి కూలి ఎంత ఇస్తున్నారని, అన్ని రికార్డులు మైంటైన్ చేయాలనీ అన్నారు. పంచాయత్ సెక్రటరీ లు ఎప్పటికప్పుడు రిజిస్టర్ లను అప్డేట్ చేయాలనీ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ప్రతి పనికి కుడా వర్క్ ఫైల్ ఉండాలని అన్నారు. వర్క్ ఫైల్ లో పనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, ఫోటోలు ఉంచాలని తెలిపారు. జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న గ్రామాలలో కుడా పనులు ఇంత ఆలస్యంగా జరుగితే ఎలా అని, పనులు త్వరగా పూర్తి చేయలని  పంచాయతి సెక్రటరీ,ఎంపి డి ఓ  లకు ఆదేశించారు.  తెలుగోనిపల్లి గ్రామం లో జరుగతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, నేమ్ బోర్డ్స్ పెట్టించాలని అన్నారు.  జరుగుతున్న పనుల ఫోటో లు తీసి వర్క్ ఫైల్ తయారు చేయాలనీ  పంచాయత్ అధికారులకు ఆదేశించారు. పనులలో నిర్లక్ష్యం వహించకుండా రెండు మూడు రోజులలో పనులను పూర్తి చేయాలనీ అన్నారు.  బీరెల్లి గ్రామం లోని వైకుంటదామం,సేగ్రి గేషన్ షెడ్డు, ప్రాథమిక ఉన్నత పాటశాలను పరిశీలించారు.. పాటశాలను శుభ్రం చేసి  సానిటేషన్ చేయించాలని, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ,  మంచి నీటి ట్యాంకును శుబ్రం చేయించాలని ప్రదానోపద్యాయుడి కి ఆదేశించారు. పరిశుభ్రమైన పరిసరాలలో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు. తదనంతరం రోడ్డు పై కనిపించిన  విద్యార్టులతో మాట్లాడి అల్బెండ జోల్ మాత్రలు వేసుకున్నారా , పాటశాలకు  వెళ్తారా అని అడుగగా, స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వెళ్తాము, మాత్రలు వేసుకున్నాము అని పిల్లల్లు బదులిచ్చారు.

ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఓ ఉమా దేవి ,మండల  స్పెషల్ అధికారి వెంకటేశ్వర్లు,  పంచాయత్ సెక్రటరీలు పరుశరాం, మాళవిక , ఎం.పి.డి.ఓ సూరి, సర్పంచులు మణెమ్మ, గీత, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–     

     జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post