గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చే టేకు, ఎర్రచందనం మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

కామారెడ్డి మండలం రాఘవపూర్, ఉగ్రవాయి గ్రామాల్లో హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. నర్సరీలో టేకు, ఎర్రచందనం, అల్లనేరేడు, జామ, దానిమ్మ, సీతాఫలం, వెదురు, ఈత పారిజాత, మందారం, కరివేపా, బొప్పాయి వంటి మొక్కలు పెంచాలని సూచించారు. నర్సరీలో నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాయి లో పల్లె ప్రకృతి వనంను సందర్శించారు. వనం లో మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారినందున పాలకవర్గం సభ్యులను అభినందించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎం పీ డీ వో నాగేశ్వర్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ———————————— జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post