గ్రామ పంచాయితీ నిర్వహణ, వైకుంఠధామం పనులపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:8.10 .2021, వనపర్తి.

గ్రామ పంచాయతీ పరిధిలో డిసెంబర్ చివరి నాటికి ఇంటి పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను, ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయితీ నిర్వహణ, వైకుంఠధామం తదితర పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు వసూలు చేయాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. వైకుంఠధామం మైనర్ పనులను ఈ నెల 20వ. తేది లోపు పూర్తి చేయాలని, పంచాయతీ పరిధిలో విద్యుత్ బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేయాలని ఆమె సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పనుల నివేదిక ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, డిపార్ట్మెంట్ యాప్ లో సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆమె తెలిపారు.
DCB (2021-22) టాక్స్, నాన్ టాక్స్, ట్రాక్టర్ లోన్స్, చెల్లింపులు (పేమెంట్స్), రిజిస్ట్రేషన్, ఈ -ఆఫీస్ పొందిన నగదుకు సంబంధించిన లోన్స్ వివరాలు, వర్మి పోస్టింగ్ తయారు చేయుట తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండల పంచాయతీ లో అధికారుల ద్వారా ఇంటి పన్నులు, రసీదు బుక్కులు, నగదుకు సంబంధించిన రిజిస్టర్లు, సి.సి. చార్జీలపై. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది జీతాల పై తదితర వివరాలపై ఆమె అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీలో DTCP అనుమతి పొందిన లే-అవుట్స్ నందు 10 శాతం స్థలము గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ వివరాలు అందించాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో డిపిఓ సురేష్ కుమార్, డీఎల్పీవో యాదయ్య, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారి చేయనైనది.

Share This Post