గ్రామ సభలను ప్రజలు ఉపయోగించుకోవాలి :జిల్లా కలెక్టర్ పి .గోపి

శనివారం ఉదయం జిల్లాలోని వర్ధన్నపేట సంగెం మండలాలలో కలెక్టర్ పర్యటించారు

ముందుగా వర్ధన్నపేట మండలం లోని చిన్నారం గ్రామంలో జరుగుతున్న గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఆజాద్ అమృత్ మహోత్సవం సందర్బంగా జరుగుతున్న గ్రామసభ లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలు గ్రామ సభలకు తప్పక హాజరుకావాలని.. వారి ఊరి సమస్యలేమైనా ఉంటే అధికారుల దృష్టికి తేవాలని కలెక్టర్ తెలిపారు.

అంతేకాక గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి కూడా అధికారులను అడిగి తెలుసు కోవచ్చని..ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం సంగం మండలం లోని రామచంద్రపురం గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం ను కలెక్టర్ పరిశీలించారు.

పల్లె ప్రకృతి వనం చుట్టూ ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలించి కలెక్టర్ అధికారులను అభినందించారు.

డంప్ యార్డ్ లో జరుగుతున్న చెత్త, ప్లాస్టిక్ వేరు చేసే విధానం బాగుందని కలెక్టర్ అన్నారు.

అక్కడే పని చేస్తున్న వాచర్ ని కలెక్టర్ ఘనంగా సన్మానించారు.

అక్కడి నుండి గవి చర్ల గ్రామం లో జరుగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని దీనిలో భాగంగా నిరుపేద మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తుందని కలెక్టర్ అన్నారు .

అనంతరం గ్రామ ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తమ గ్రామంలోని పాఠశాలలో లో మరుగుదొడ్లు లేవని…కలెక్టర్ త్వరగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్కు మహిళలు తెలియజేసారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా త్వరలోనే పనులు చేపట్టే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్,డి .ఆర్.డి.ఓ సంపత్ రావు, డి పి ఓ ప్రభాకర్, గ్రామ సర్పంచులు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post