గ్రామ స్తా యి మల్టీ డిసిప్లినరీ టీములను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది: 26-10-20 21

 

గ్రామ స్తా యి మల్టీ డిసిప్లినరీ టీములను ఏర్పాటు చేసి  ప్రతి ఇంటిని  సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

 

మంగళవారం సాయంత్రం  హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా వైద్య అధికారులు, జిల్లా పరిషత్ సీఈవో లు, జిల్లా పంచాయతీ అధికారులతో జిల్లాల వారిగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఆశా,  అంగన్వాడి, పంచాయతీ సెక్రెటరీ, విఆర్ఏ,  రేషన్ షాప్ డీలర్లతో కూడిన గ్రామ స్తా యి మల్టీ డిసిప్లినరీ టీములు స్పెషలాఫీసర్ల పర్యవేక్షణలో ప్రతి ఇంటికి  సర్వే చేసి వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని, సర్వేలో ఎవరు మొదటి డోస్ వేసుకున్నారు, ఎవరు రెండవ డోస్

వేసుకున్నారు,  ఎవరు అసలే వాక్సిన్ వేసుకోలేదు అనే వివరాలను సేకరించాలని, వాక్సిన్  కార్యక్రమాన్ని 100 శాతం నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల 60 లక్షల మందికి లక్ష్యానికి గాను 3 కోట్ల 5 లక్షల మందికి వాక్సిన్ వేశామని,  100 శాతం వ్యాక్సినేషన్ వేయడమే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో రోజు వారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని సూచించారు.

విడియో కాన్ఫరెన్సు లో జిల్లా నుండి  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ లు శ్రీహర్ష, రఘురాం శర్మ , జిల్లా పంచాయతీ అధికారి శ్యాం  సుందర్, డి ఆర్ డిఓ  ఉమా దేవి, జడ్ పి సి ఇ ఓ విజయనయాక్ వైద్య అధికారి చందు నాయక్ , ముషాయిదా బేగం, డాక్టర్ శశి కాళ్ళ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడి వర్కర్లు,పంచాయతి సెక్రటరీ, వి ఆర్ ఎ , రేషన్ షాప్  డీలర్లు,లతో   టీంల  ను ఏర్పాటు చేయల్లన్నారు. మండల స్పెషల్ అధికారులు ప్రజలను మోబిలైజ్ చేసి జిల్లా లో 100 శాతం వ్యాక్సినేషన్ అయ్యేలా చూడాలని  అధికారులకు ఆదేశించారు.

———————————————————————————జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post