గ్రీన్ బడ్జెట్ను వినియోగించి పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు

గ్రీన్ బడ్జెట్ను వినియోగించి పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మున్సిపల్ అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రకృతి వనాలలో మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ పట్టణాలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. పండ్ల, పూల మొక్కలు పెంచాలని సూచించారు. ఆస్తిపన్ను బకాయిలు వసూలు చేయాలని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ టీం లు పగడ్బందీగా పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డీవో శీను, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, రమేష్ కుమార్, జగ్జీవన్, టౌన్ ప్లానింగ్ అధికారి శైలజ, అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post