“గ్రీవెన్స్ డే” లో అందిన ప్రతి దరఖాస్తుకు పరిష్కార మార్గం చూపి త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు, 16 ఖమ్మం:

“గ్రీవెన్స్ డే” లో అందిన ప్రతి దరఖాస్తుకు పరిష్కార మార్గం చూపి త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన “గ్రీవెన్స్ డే”లో పలు సమస్యలపై అర్జీదారుల నుండి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఖమ్మం నగరానికి చెందిన శెట్టి ఉజ్వల తన భర్త జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంప్యూటర్ డెటా ఆపరేటర్గా పనిచేస్తూ కిడ్నీ వ్యాధితో మరణించారని, కారుణ్య నియామకం ద్వారా తనకు ఏదైనా ఉద్యోగము ఇప్పించగలరని. సమర్పించిన దరఖాస్తును, రఘునాథపాలెం మండలంకు చెందిన సహదేవ్ తనకు యాక్సిడెంట్లో రెండు కాళ్ళుకోల్పోవడం జరిగినదని తనకు త్రిచక్ర వాహనం, వికలాంగుల ఫించను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును, కూసుమంచి మండలం గడ్డమీదతండాకు చెందిన బి. లాలి తనకు కస్తూర్భాగాంధీ బాలికల వసతి గృహమునందు స్వీపర్గా ఉద్యోగం ఇప్పించగలరని, బోటిమీద తండాకు చెందిన డి. సీతారాములు తనకు ఇంటి స్థలం ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తులను, రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన పోతనబోయిన రమేష్ తనకు కోయవలక గ్రామంలో సర్వేనెం 213/అ2 లో 20 కుంటల భూమికి తన పేరున పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును, తల్లాడ మండలం వెంకటగిరి గ్రామంకు చెందిన దీవెల భద్రయ్య తనకు గల భూమికి సంబంధించిన పాస్బుక్ తన కుమారుడు బలవంతంగా తీసుకున్నాడని తనకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును, నేలకొండపల్లి మండలం కోరుట్ల గూడెం సర్వేనెం. 350లో 16 ఎకరములు భూమి కొనుగోలు చేయడం జరిగినదని అట్టి భూమి రికార్డులలో నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ గా ఉండడం వలన రిజిస్ట్రేషన్ అవుటలేదని అట్టి భూమిని అగ్రికల్చరల్ ల్యాండ్గా కన్వ ర్షన్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యేందుకు అవకాశం కల్పించగలరని సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని పరిష్కార స్వభావాన్ని అర్జీదారునికి తెలపాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ప్రయివేటు భవనాలలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పౌర సరఫరాల గిడ్డంగుల నిర్మాణాలకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.

గ్రీవెన్స్డ్ కార్యక్రమంలో అదనపు కటెక్టర్ ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post