“గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రజల అర్జీలను స్వీకరించి సత్వర చర్యకై సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు, 15,ఖమ్మం –

“గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రజల అర్జీలను స్వీకరించి సత్వర చర్యకై సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లా వివిధ ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారానికి “గ్రీవెన్స్ డే”లో సమర్పించే అర్జీలను పరిశీలన చేసి సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే అర్జీలపై సంబంధిత మండల స్థాయి అధికారులు, అదేవిధంగా జిల్లా స్థాయికి సంబంధించిన అర్జీలపై సంబంధిత జిల్లా. అధికారులు తగు చర్యలు తీసుకొని అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వైరా మండలం సిరిపురం నుండి వచ్చిన వసంత సక్కుబాయి తన సర్వేనెం 570 6/3లో గల భూమి ధరణీలో నమోదు చేయగలరని సమర్పించిన అర్జీని పరిశీలించి తగు చర్యగైకొనాలని సంబంధిత తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు. పాండురంగాపురం చెందిన బోళ్ళ మణి, తన భర్త సుతారీ పనిచేస్తూ 2019లో ప్రమాదవశాత్తు మరణించారని, భీమా సొమ్ము మంజూరు కాలేదని సమర్పించిన అర్జీపై సత్వర చర్యలు తీసుకొని భీమా సొమ్ము చెల్లింపు చేయాలని కార్మిక శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. పెదగోపవరం నుండి వచ్చిన జె. వెంకటేశ్వరరావు ఎన్.ఎస్.పి కెనాల్ భూముల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన అర్జీని పరిశీలించి తగు చర్య గైకొనాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు. నగరంలోని 60వ డివిజన్ నుండి వచ్చిన డి. నిర్మల తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించగలరని, వైరా మండలం గండు గల పాడుకు చెందిన జి. వెంకటేశ్వరరావు పట్టాదారు పాస్ బుక్ ఇప్పించగలరని, గాంధీనగర్ కు చెందిన జి కృష్ణవేణి తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయగలరని, వేంసూరు మండలం లచ్చన్న గూడెం నుండి వచ్చిన మోడా పార్వతమ్మ తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయగలరని, సుందరయ్య నగర్ నుండి వచ్చిన అనపర్తి మారతమ్మ తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయగలరని, ముదిగొండ మండలం బాణాపురంకు చెందిన మర్రికంటి స్నేహ తనకు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించగలరని, ఖానాపురం హవేలికి చెందిన రుద్ర హనుమంతరావు తనకు పట్టాదారు పాస్ పుస్తకం. ఇప్పించగలరని సమర్పించిన అర్జీలను పరిశీలన చేసి సత్వర చర్యలు తీసుకొని అర్జీలన్నీంటిని పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు గ్రీవెన్స్ డే లో పాల్గొన్నారు.

Share This Post