గ్రీవెన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి..

ప్రచురణార్థం

గ్రీవెన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి…

మహబూబాబాద్ అక్టోబర్ 11.

గ్రీవెన్స్ లో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో పలు విజ్ఞప్తులను కలెక్టర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా నర్సింహులపేట మండలం పంతడప్పుల గ్రామానికి చెందిన ఎలుక సత్తమ్మ గోపి రెడ్డి తనకున్న 138 సర్వేనెంబర్ లో 3.8 ఎకరాలు టైటిల్ డీడ్ పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారని అందులో ఒక ఎకరం తన కుమార్తె వేముల చంద్రకళ కు పసుపు కుంకుమ కింద అందజేసి నందున రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేయించాలని దరఖాస్తు అందించారు.

అదే మండలం మునిగలవీడుకు చెందిన దుస్స శ్రీనివాస్ తన దరఖాస్తును అందిస్తూ తమ గ్రామంలో cpw పథకం కింద హైదరాబాద్కు చెందిన వారు సెప్టెంబర్ 2015 లో త్రాగు నీటి పథకం నిర్మించారని ప్రజలకు తక్కువ ధరకే త్రాగునీరు అందచేయాలనే సంకల్పంతో వాటర్ క్యాన్ కు ఐదు రూపాయల చొప్పున 2019 వరకు వసూలు చేశారని అనంతరం క్యాంపు ₹10 చేస్తూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారని మిషన్ భగీరథ నీరు కూడా ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా డిసెంబర్ 2020లో కొత్త త్రాగు నీటి పథకం ప్రారంభించారని గ్రామ సర్పంచ్ తీసుకునే నిర్ణయాలు అవినీతికి దారితీస్తున్న అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తాళ్ల పూస పల్లి కి చెందిన బి సంపూర్ణ తను ఒంటరి మహిళ అని తనకు 2 .10 ఎకరాలు భూమి ఉందని తన పేరున పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు.

మరిపెడ మండలం ఎల్లంపేట కు చెందిన తాళ్లపల్లి శ్రీహరి సర్వే నెంబర్ 142, 158 లో గల తన భూమి ఇతరుల పేరుతో నమోదైందని జూన్ 2019 లో అర్జీ కూడా పెట్టుకున్నానని తనకు న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు అభిలాష అభినవ్ రెవెన్యూ కొమరయ్య జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఎ పిడి సన్యాసయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post