గ్రీవెన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి..

ప్రచురణార్థం

గ్రీవెన్స్ దరఖాస్తులను
సత్వరమే పరిష్కరించాలి..

మహబూబాబాద్, డిసెంబర్ – 06:

ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ పరిష్కారం చేయుటకు కోరుతూ సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లోని ప్రగతి సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

జూనియర్ పంచాయితీ కార్యదర్శి పోస్టుల నియామకంలో మెరిట్ జాబితాలో ఉన్నప్పటీకి తన కంటే మెరిట్ లో తక్కువ వారికి ఉద్యోగం కల్పించారని, తనకు ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తామని చెప్పి పంపివేసారని, పంచాయితీ సెక్రటరీగా నియమించాలని కోరుతూ మహబూబాబాద్ కు చెందిన బానోత్ సతీష్ కోరారు.

తొర్రూర్ మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన ఆవుల రాణి తన భర్త చనిపోయారని, తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, ఎలాంటి స్థిర, చరాస్తులు లేనందున వారి పోషణార్ధం ఆసర పెన్షన్ ఇప్పించాలని పలు మార్లు గ్రామ పంచాయితీ కార్యదర్శికి విన్నవించడం జరిగిందని, ఇప్పటి వరకు పెన్షన్ రాలేదని, ఇప్పించలని కోరారు.

నర్సింహులపేట మండలం బొజ్జెన్నపేట గ్రామానికి చెందిన గుండమల్ల శ్రీనివాస్ తనకు మరుగుదొడ్డి సౌకర్యం మంజూరు చేయగలరని కోరారు.

తన భర్త కేంద్ర ప్రభుత్వపు స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతూ మరణించిన తదనంతరం తనకు పెన్షన్ వస్తున్నదని, స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో వ్యవసాయ భూమి, ఇంటి స్థలం గాని మంజూరు చేయాలని కోరుతూ మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన మూల వెంకటమ్మ కోరారు.

కేసముద్రం మండలం మర్రి తండాకు చెందిన వి.కళ్యాణ్ తాను విశాఖపట్టణంలోని విజ్ఞాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో బి.టెక్ చదువుచున్నానని, స్కాలర్ షిప్ మంజూరై రావడం లేదని, తన పేరున రిలీజ్ చేయాలని కోరారు.

కేసముద్రం కు చెందిన ప్రభావతి తాను ఎస్సీ కులం కుచెంది, డిగ్రీ, B.PED చదివి వున్నానని తనకు బ్యాక్ లాగ్ లో ఉద్యగ అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరారు.

గ్రీవెన్స్ దరఖాస్తులు, కోర్టు కేసెస్ పై పెండింగ్ లో ఉన్న వాటిపై శాఖల వారీగా సమీక్షిస్తూ వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, కొమరయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post