గ్రీవెన్స్ దరఖాస్తులు పెండింగ్ లో ఉంచ రాదు :జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య

 

 

 

ప్రచురణార్ధం
ములుగు, జనవరి 03,2022.

ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రతి సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంనిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి

పాల్గొని ప్రజల విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పైన జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని శాఖల వారిగా గ్రీవెన్స్ పెండింగ్ ఉన్న శాఖల అధికారు త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారుల ను ఆదేశించారు. ఈ రోజు దరఖాస్తులు 18 వచ్చాయని వాటిని త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు.

జిల్లా లో కోవిడ్ వ్యాక్సినేషన్ 15 నుండి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థిని , విద్యార్థులు లకు కోవాక్షిన్ టికాలు రేపటినుండి జూనియర్,డిగ్రీ కాలేజి లలో క్యాంపులు ఏర్పాటు చేసి మొదటి దోస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలోని మండలాల వారీగా సామ్ – మామ్ పిల్లలను గుర్తించి వారి సంఖ్య తగ్గించే విధంగా పౌష్టికాహారం అందించి పిల్లల భవిష్యత్తు ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయా మండల స్పెషల్ ఆఫీసర్స్, తాసిల్దార్స్ శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గుత్తికోయల పిల్లలను గుర్తించి వారికి పౌష్టిక ఆహారం అందేలా చూడవల్సిన భాద్యత మన అందరిదని గుర్తు చేశారు. ప్రైవేటు భవనాలలో ఉన్న అంగన్వాడి సెంటర్ లనుప్రభుత్వ పాఠశాలలకు మార్చుటకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలలో తగిన సౌకర్యాలు లేనట్లు ఐతే సౌకర్యలు సమకూర్చుటకు తగు నివేదికలు తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారికి సూచనలు ఇచ్చారు. మొదట పైలెట్ ప్రాజెక్టుగా కన్నాయిగూడెం మండలాన్ని తీసుకుని అంగన్వాడి సెంటర్స్ ని ప్రభుత్వ పాఠశాలలకు మార్పిడి చేసినట్లైతే బాగుంటుందని ఏదైనా పాఠశాలలో తగు వసతులు లేనట్లయితే అందుకు సంబంధించిన నివేదికలు సమర్పించాల్సిందిగా డి డబ్ల్యూఓను ఆదేశించారు.
ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న బాల రక్షా భవన్ మరియు వన్ స్టాప్ సెంటర్లను ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ బాల రక్షా భవన్ మరియు వన్ స్టాప్ సెంటర్ నిర్మాణం పూర్తయినందున అందులోకి మార్చుటకు జిల్లా కలెక్టర్ డి డబ్ల్యూఓను ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయగలమని ప్రస్తుతం అద్దె భవనంలో నడిపిస్తున్న బాల రక్షా భవన్ ,వన్ స్టాప్ సెంటర్స్ ని నూతనంగా నిర్మాణం చేపట్టి పూర్తయిన భవనంలోకి మార్చుటకు ఆదేశించి ఉన్నారు . ఏదైనా ఇన్ఫ్రా స్ట్రక్చర్ అవసరమైనచో నివేదికల రూపంలో రిపోర్టులు సమర్పించ వలసిందిగా ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రమాదేవి, డి ఎం హెచ్ ఓ డా. అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, ఎల్ డి ఎం ఆంజనేయులు, జడ్పీ సీఈఓ ప్రసన్న రాణి, డి పి ఓ వెంకయ్య, డి వి హెచ్ ఓ డాక్టర్ విజయ భాస్కర్ డి సి ఓ సర్దార్ సింగ్, డి సిడబ్యు డి ఓ భాగ్యలక్ష్మి, డిడబ్ల్యు ఓ ప్రేమ లత మరియు సంబందిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post