వరంగల్
గ్రీవెన్స్ దరఖాస్తు లను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వివిధ సమస్య ల పైన వినతులను ఇవ్వడానికి వచ్చిన ప్రజల నుండి ఆయా దరఖాస్తు లను కలెక్టర్
స్వీకరించారు
అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రీవెన్స్ దరఖాస్తుల పైన అత్యంత శ్రద్ద పెట్టి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలన్నారు
పలు మార్లు బాధితులు గ్రీవెన్స్ కి రాకుండా వారి సమస్య లకి అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పుడే అధికారుల పైన ప్రజల కు నమ్మకం తో పాటు గుర్తింపు లభిస్తుందన్నారు
ఎండలు మండి పోతున్న నేపథ్యంలో.. దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు తగు జాగ్రత్త లు తీసుకోవాలన్నారు
వడ దెబ్బ కు గురి కాకుండా జాగ్రత్త లు పాటించాలన్నారు
పెద్ద వారు ఎండ లకు బయటికి రాకపోవడమే మంచిదని…. వారి సమస్య ల పైన పెట్టుకోవలిసిన దరఖాస్తు లను వారికి సంబందించిన వ్యక్తులతో పంపించినా సరిపోతదని కలెక్టర్ ఈ సందర్బంగా ప్రజలను కోరారు
ఈనాటి ప్రజావాణి కార్యక్రమానికి 44 దరఖాస్తు లు వచ్చాయి
గ్రామ సభ లో సంబంధిత అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ జిల్లా అధికారులకు తెలిపారు
అలాగే ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక స్పెషల్ అధికారిని నియమించాలని సివిల్ సప్ప్లై అధికారికి చెప్పారు
ఎండలు విపరీతంగా ఉన్నందున మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు
మన ఊరు మన బడి కార్యక్రమ పనులు వేగవంతం కావాలన్నారు
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు హరి సింగ్, శ్రీ వాత్సవ, rdo పవన్ కుమార్, dpo, zp సీఈఓ, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు