గ్రూప్-1 అభ్యర్థులకు ఆన్లైస్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం: జిల్లా కల్లెక్టర్ జి. రవి

ప్రచురణార్దా౦—-2

తేది. 20.07.2022

గ్రూప్-1 అభ్యర్థులకు ఆన్లైస్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం: జిల్లా కల్లెక్టర్ జి. రవి
(బీ.సి.స్టడీ సర్కిల్, కరీంనగర్)

జగిత్యాల , జూలై 20: తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన
తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ కేంద్రము (తెలంగాణ రాష్ట్ర బి. సి.స్టడీ సర్కిల్) ద్వారా
గ్రూప్-1 అభ్యర్థులకు హైదరాబాద్ బి.సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 1000 మంది అభ్యర్థులకు 5 ఆగష్టు
2022 నుండి ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్ డైరెక్టర్ రవి కుమార్ ఒక
ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత శిక్షణ కొరకు ఉమ్మడి కరీంనగర్ (జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు
చెందిన నిరుద్యోగ అభ్యర్థులను డిగ్రీ మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపికచేసామన్నారు.
పదవ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీలో తప్పనిసరిగా 60 శాతం మార్కులతో పాస్ అయినవారిని మాత్రమే
కోచింగ్ కు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.5 లక్షలలోపు
ఉండాలన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 29-07-2022 వరకు, రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు
దరఖాస్తు ఫారం & పూర్తి నోటిఫికేషన్ కొరకు సంప్రదించవలసిన వెబ్ సైట్ WEBSITE:
http://tsbcstudycircles.cgg.gov.in టిఎస్బీసీస్టడీ సర్కిల్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులందరు వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు(ssc,
Inter,Degree,Caste,Income and Aadhar) లతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్ : 040 27077929 లో మరియు బీ.సి.స్టడీ సర్కిల్
కార్యాలయం ఆఫీసు వెళ్లల్లో సంప్రదించాలని సూచించారు.

జిల్లా పౌరస౦బంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.

Share This Post