గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*జూన్ 11న ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంట వరకు పరీక్ష నిర్వహణ
—————————
పెద్దపల్లి, జూన్ -07:
—————————

జిల్లాలో జూన్ 11న నిర్వహించు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లను చేసి సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు ఎటువంటి చిన్న తప్పిదాలు జరుగకుండా, గతంలో సమర్థవంతంగా నిర్వహించిన పరీక్షల అనుభవంతో జూన్ 11న ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-00 వరకు నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా పకడ్బంది ఏర్పాట్లను చేపట్టాలని, చీఫ్ సూపరింటెండెంట్ మానిటరింగ్ చేసే విధంగా సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రామగుండంలో 10, పెద్దపల్లి లో 3, సుల్తానాబాద్ లో 2, రామగిరిలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా, ఉర్దూ భాష అభ్యర్థులు 42, తెలుగులో పరీక్ష రాసే వారు 6025 మొత్తం 6067 మంది పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.

పరీక్షా కేంద్రాలలో వికలాంగుల కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలను కల్పించాలని, స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రానికి తిరిగి పరీక్షా కేంద్రం నుండి రిసెప్షన్ సెంటర్ కు తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, రూట్ అధికారులు పరీక్షా మెటీరియల్ ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూం నుండి పోలీస్ బందోబస్తుతో తీసుకొని వెళ్ళి పరీక్షా కేంద్రాల్లోని లైజనింగ్ అధికారులకు అందజేయాలని, పరీక్ష అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని రిసెప్షన్ సెంటర్ లో టి.ఎస్.పి.ఎస్.సి. అధికారులకు అందజేయాలని ఆదేశించారు.

సీటింగ్ అరేంజ్మెంట్స్, రూం వారీగా హాల్ టికెట్స్ వివరాలను అభ్యర్థులకు కనబడే విధంగా ప్రదర్శించాలని, అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉదయం 8-30 గంటల నుండి పరీక్షా కేంద్రాల లోనికి ప్రవేశం కల్పించాలని, అభ్యర్థులు ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డు, హాల్ టికెట్ లు చూపించి పరీక్షా కేంద్రంలోకి వెళ్లే విధంగా చూడాలని, పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదనీ తెలిపారు.

పరీక్షకు ముందు బబ్లింగ్ గురించి అభ్యర్థులకు తెలియజేసీ, టి.ఎస్.పి.ఎస్.సి. నియమ, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్స్, చీఫ్ సూపరింటెండెంట్, లైజనింగ్ అధికారులు, రెవెన్యూ శాఖ డి.టి. ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post