గ్రౌండింగ్ లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించాలి ::జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—1

తేదీ.25.5.2022

ప్రచురణార్థం---1 తేదీ.25.5.2022 గ్రౌండింగ్ లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించాలి ::జిల్లా కలెక్టర్ జి.రవి నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఇఓ లకు షోకాజ్ నోటీసులు జారీ నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలి మన ఊరు మన బడి కార్యక్రమాల పై సంబంధిత అధికారులతో జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జగిత్యాల మే 25:- మన ఊరు మన బడి కార్యక్రమం గ్రౌండింగ్ లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.  జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 113 పాఠశాలల అనుమతులు పూర్తయ్యాయని, డీఈఈ లో వద్ద 4 పాఠశాలల, ప్రధానోపాధ్యాయుల వద్ద 34 పాఠశాలలు, ఈఈల వద్ద 10 పాఠశాలలు, ప్రాజెక్ట్ తయారు చేయకుండా 59 పాఠశాలలు, ఏఈ లో వద్ద 46 పాఠశాలల అనుమతుల జారీ పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధిక సమయం ప్రతిపాదనలు పెండింగ్ లో ఉంచే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి పాఠశాల ప్రతిపాదన అధికారి వద్ద ఎంత సమయం పెండింగ్ ఉందో తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ అన్నారు.  ప్రస్తుతం 78 పాఠశాలలో పనులు గ్రౌండింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పనులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. 78 పాఠశాల నిర్వహణ కమిటీలకు ప్రతిపాదనలో 10% నిధులను బాగానే విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులు స్థానిక ఎమ్మెల్యేల తో సమన్వయం చేసుకుని పనులు త్వరగా ప్రారంభించాలని, ధర్మపురి నియోజకవర్గంలోని పాఠశాలలో పనులు ప్రారంభించాల్సిందిగా మంత్రి సూచించారని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురువారం నుంచి, కోరుట్ల ఎమ్మెల్యే శుక్రవారం నుంచి ప్రతి మండలంలో కనీసం 2 పాఠశాలలు పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారని, వారితో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 78 పాఠశాలల్లో నిర్మాణ పనుల చేపట్టడానికి అవసరమైన మేర ఇసుక, అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు తదితర వివరాలు తహసిల్దార్ లకు అందజేయాలని, సమీపంలో గల ఇసుక నెల్లూరు నుంచి వెంటనే సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.  మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహణ పట్ల విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనించామని, జిల్లాలో తక్కువగా పనులు చేసిన మండలాల ఎంఈఒలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, తదుపరి సమావేశం సమయానికి పరిస్థితి మెరుగు పడకపోతే సస్పెండ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనులు వేగవంతం అయ్యే దిశగా ఇతర శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, 18 మండలలా ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.
గ్రౌండింగ్ లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించాలి ::జిల్లా కలెక్టర్ జి.రవి

నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఇఓ లకు షోకాజ్ నోటీసులు జారీ

నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

మన ఊరు మన బడి కార్యక్రమాల పై సంబంధిత అధికారులతో జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

జగిత్యాల మే 25:- మన ఊరు మన బడి కార్యక్రమం గ్రౌండింగ్ లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 113 పాఠశాలల అనుమతులు పూర్తయ్యాయని, డీఈఈ లో వద్ద 4 పాఠశాలల, ప్రధానోపాధ్యాయుల వద్ద 34 పాఠశాలలు, ఈఈల వద్ద 10 పాఠశాలలు, ప్రాజెక్ట్ తయారు చేయకుండా 59 పాఠశాలలు, ఏఈ లో వద్ద 46 పాఠశాలల అనుమతుల జారీ పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధిక సమయం ప్రతిపాదనలు పెండింగ్ లో ఉంచే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి పాఠశాల ప్రతిపాదన అధికారి వద్ద ఎంత సమయం పెండింగ్ ఉందో తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ అన్నారు.

ప్రస్తుతం 78 పాఠశాలలో పనులు గ్రౌండింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పనులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. 78 పాఠశాల నిర్వహణ కమిటీలకు ప్రతిపాదనలో 10% నిధులను బాగానే విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు.

మండల ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులు స్థానిక ఎమ్మెల్యేల తో సమన్వయం చేసుకుని పనులు త్వరగా ప్రారంభించాలని, ధర్మపురి నియోజకవర్గంలోని పాఠశాలలో పనులు ప్రారంభించాల్సిందిగా మంత్రి సూచించారని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురువారం నుంచి, కోరుట్ల ఎమ్మెల్యే శుక్రవారం నుంచి ప్రతి మండలంలో కనీసం 2 పాఠశాలలు పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారని, వారితో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
78 పాఠశాలల్లో నిర్మాణ పనుల చేపట్టడానికి అవసరమైన మేర ఇసుక, అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు తదితర వివరాలు తహసిల్దార్ లకు అందజేయాలని, సమీపంలో గల ఇసుక నెల్లూరు నుంచి వెంటనే సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహణ పట్ల విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనించామని, జిల్లాలో తక్కువగా పనులు చేసిన మండలాల ఎంఈఒలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, తదుపరి సమావేశం సమయానికి పరిస్థితి మెరుగు పడకపోతే సస్పెండ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనులు వేగవంతం అయ్యే దిశగా ఇతర శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, 18 మండలలా ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.

Share This Post