ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
00000
భారత 74 వ గణతంత్ర దినోత్సవం జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు.
గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు , జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించిందని ఆ త్యాగధనులకు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆ త్యాగదనుల ఆశయాలను ఆకాంక్షలను భావి తరాలకు అందించి వారు ఆశించిన ఆశయాలు ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన చిన్నారులకు బహుమతులు అందజేశారు.
అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, జీవి శ్యాం ప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఏఓ నారాయణస్వామి, జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు