ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరీశ్,


పోలీసుల గౌరవ వందనం… అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు,
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ఎంతో ముందంజలో ఉందని… మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శామీర్పేటలోని నూతన కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీశ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను తెలియజేశారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి అభివృద్దిలో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కలెక్టర్ హరీశ్ ప్రశంసాపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులను కలెక్టర్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) వారికి స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) కు బ్యాంకు లింకేజీ కింద రూ.30 కోట్ల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ హరీశ్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జెడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, జిల్లా కోపరేటివ్ డైరెక్టర్ మధుకర్ రెడ్డి,శామీర్పేట్ జెడ్పీటి సి , అనిత, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డీసీపీ సందీప్, జిల్లా కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

సందేశము ……….

భారత 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వతంత్ర దేశముగా ఆవిర్భవించిన మన భారతావని స్వేచ్ఛ, సమానత్వo, సౌభ్రాతృత్వం మరియు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాలకు అందించడానికిగౌరవనీయులు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు రూపొందించిన రాజ్యాంగo ద్వారా1950 జనవరి 26 న, మన దేశాన్ని గణతంత్ర దేశoగా ప్రకటించుకున్న విషయం మీ అందరికీ తెలుసు.దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను పణంగా పెట్టిన ఎందరో త్యాగధనులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా ప్రగతి పథంలోముందుకు సాగుతున్నదనివినమ్రంగా తెలుపుకుంటున్నాను.
సమగ్ర అభివృద్ది, మెరుగైన సేవలు లక్ష్యoగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలు మన జిల్లాలో ప్రజా ప్రతినిధులు మరియు ప్రజల భాగస్వామ్యoతో స్ఫూర్తిదాయకంగా నిర్వహించబడుతున్నవి.
జిల్లాలోని అన్ని గ్రామాలను మరియు పట్టణాలను ఆదర్శంగా రూపొందించడానికి పల్లె మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా మౌళిక సదుపాయాలైన వైకుంఠధామాలు,స్మృతివనాలు,డంపింగ్యార్డులు, పిల్లలకు పెద్దలకు ఆహ్లాదకరమైన పార్కులు, పచ్చదనం కోసం నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, ప్రభుత్వ భవనాల మరమ్మత్తులు చేయడం, నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల ఏర్పాటు, పారిశుద్ధ్య అవసరాల కోసం ట్రాక్టర్లు సమకూర్చుకోవడం,విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరుచుకోవడంతోపాటుపర్యావరణాన్నికి హాని కలిగించే ప్లాస్టిక్ ను నిషేధించుట వంటి కార్యక్రమాల అమలుకు కృషిచేస్తున్న వారందరికీ నా హృదయపూర్వకధన్యవాదాలు.
సర్వేoద్రియానాం నయనం ప్రధానం అనే దృష్టి కోణంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ K. చంద్రశేఖర్ రావు గారి దిశానిర్ధేశంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమoఈ మాసం 18 వ తారీకు నుండి ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం వంద రోజుల పాటు 27 లక్షల 51 వేల 810 మంది ప్రజలకు 83ప్రత్యేక కంటి వైద్య బృంధాల ద్వారా,418 ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వివిధ రకాలైన కంటి సమస్యలను పరిష్కరిస్తూవిజయవంతంగా నిర్వహించగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్ధాలు అందించడం జరుగుతుంది.

తెలంగాణరోగనిర్ధారణ కేంద్రాల ద్వారా ప్రజలకు 52 రకాలపరీక్షలునిర్వహించి ఉచితంగాసేవలు అందించడం జరుగుతున్నది. అందుకు గాను కేంద్రప్రభుత్వంద్వారానేషనల్ క్వాలిటీ అస్సురెన్స్స్టాండర్డ్స్ కేంద్రాలుగా గుర్తించబడి 3 లక్షలరూపాయలనగదుపురస్కారంపొందిందనితెలుపుటకు సంతోషిస్తున్నాను.
జిల్లాలోప్రస్తుతఆర్ధికసంవత్సరానికిగాను,ఎకరాకుపదివేలరూపాయలుచొప్పున, 34, 534 మందిరైతులకు, 66 కోట్ల64 లక్షలరూపాయలురైతుబంధుపథకం ద్వారా పెట్టుబడి సహాయంఅందజేయడంజరిగినది.“రైతుజీవితభీమా”పథకంద్వారామనజిల్లాలోఇప్పటివరకుచనిపోయిన416రైతుకుటుంబాలకు 20 కోట్ల 80 లక్షలరూపాయలుభీమాసహాయంఅందజేయడంజరిగినది.
జిల్లాలో 3,928హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతున్నది. సమీకృత ఉద్యాన అధివృద్ది పధకంలో భాగంగా పండ్లు మరియు కూరగాయలు సాగు చేసే34మంది రైతులకు 40%రాయితీని అందించడం జరిగినది. తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా 80 నుండి90శాతంసబ్సిడీ పైన ఇప్పటి వరకు 32 హెక్టర్లకు 21 మందిరైతులకు డ్రిప్ పరికరాలను మంజూరు చేయడమైనది.
జిల్లాలో 636 చౌకధరలదుకాణములద్వారా 5 లక్షల 25 వేల ఆహారభద్రతకార్డుల ద్వారా 17 లక్షల 26 వేల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేయబడుతున్నవి. ఇప్పటి వరకు 1 కోటి 71 లక్షల మెట్రిక్టన్నులబియ్యం, 18 వేల 715 మెట్రిక్టన్నులగోధుమలుమరియు 164 టన్నులచక్కెరపంపిణీచేయడంజరిగినది. క్రొత్తగా 983 ఆహారభద్రతకార్డులుమంజూరుచేయబడ్డాయి.
జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 11 ధాన్య సేకరణ కేంద్రముల ద్వారా లక్ష నలభై మూడువేల క్వింటాళ్ల ధాన్యమును రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి 2 వేల 809 మంది రైతుల ఖాతాలలో 29కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది.
ప్రజలకు సత్వర సేవలు అందించడానికి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు, మ్యుటేషన్ లు వంటి సేవలు పారదర్శకంగా మరియు వేగవంతంగాధరణి పోర్టల్ ద్వారాసేవలు అందించడం జరుగుతుంది.వివిధ భూసమస్యల క్రింద 31 వేల ఆన్ లైన్ దరఖాస్తులు రాగా ఇందులో 27వేల దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది.
జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు గాను 78 నర్సరీల ద్వారా మొక్కల పెంపకం జరుగుతుంది.ప్రతి గ్రామ పంచాయితీలో పల్లె ప్రకృతి వనాలను,మునిసిపల్ పరిధిలో బృహత్పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుచేసుకొని వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే 65 లక్షల 53వేల మొక్కలు నాటి, జిల్లా లక్ష్యాన్నిఅధిగమించిరాష్ట్రంలో ఆదర్శంగా నిలిచామని తెలుపుటకుఆనందిస్తున్నాను.
సామాజిక భద్రత కోసం జిల్లాలోవృద్దాప్య, వితంతు, గీత కార్మిక, చేనేత, ఒంటరి మహిళలకు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు మరియు బీడీ కార్మికులకు ప్రతి నెల రూ. 2016/- చొప్పున మరియు వికలాంగులకు రూ. 3016/- చొప్పున లక్ష 49వేల 114మంది పింఛన్ దారులకు 36కోట్ల 42 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. బ్యాంకు లింకేజి ద్వార 2785స్వయం సహాయక సంఘాలకు 152కోట్ల 93 లక్షల రూపాయల లక్ష్యానికి 125 కోట్ల 97 లక్షలు పంపిణీ చేయడం జరిగింది.
గొర్రెల పంపిణీ పధకము క్రింద ఇప్పటి వరకు 48కోట్ల 82 లక్షల రూపాయలతో 75% సబ్సిడీతో 3,864యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది. పశువులకు అత్యవసర పశు వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో రెండు సంచార పశు వైద్య శాలలు ఏర్పాటు చేయడమైనది.
ప్రభుత్వము చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగoగా జిల్లాలోఇప్పటివరకు 233చెరువులలో 69లక్షల 66వేల చేప పిల్లలు విడుదల చేయడం జరిగినది. ఔత్సాహిక మత్స్యకార మహిళలకు చేపలు, రొయ్యల వంటకాల తయారీ, మార్కెటింగ్ అంశాలపై 14మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
టిఎస్ఐపాస్ద్వారా జిల్లాలోఇప్పటివరకు5,558ఔత్సాహికపారిశ్రామికవేత్తలకువివిధశాఖలనుండి9,503 అనుమతులు ఇప్పించడంజరిగింది . ఇప్పటివరకు10,400సూక్ష్మ, చిన్న, మధ్యతరహామరియుభారీపరిశ్రమలురూ.15వేల 459 కోట్లపెట్టుబడితోస్థాపించిసుమారు 2 లక్షల 18 వేల మందికిఉపాధికల్పిస్తున్నాము.
జిల్లాపరిశ్రమలకేంద్రంద్వారాప్రధానమంత్రిఉపాధికల్పనపథకంక్రింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకురుణముతోకూడినసబ్సిడీద్వారా 27సూక్ష్మపరిశ్రమలుస్థాపించబడినవని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.
ఆరోగ్య లక్ష్మి పథకం క్రింద గర్భిణిలు, బాలింతలు, శిశువులకు పౌష్టిక ఆహరం కోసం పాలు, గుడ్లు, బాలామృతంమరియు సంపూర్ణ భోజనం అందిస్తున్నాము. జిల్లాలోని 793 అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 70,600మంది పిల్లలు మరియు 11,500మంది గర్భిణీలు, బాలింతలు ఈ పథకం ద్వార ప్రతి రోజు లబ్ది పొందుతున్నారు. జిల్లాలో పిల్లలు మరియు బాలికలకు పూర్తి భద్రత కల్పించేందుకు సఖి సెంటర్లు ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతున్నది.అసంఘటిత రంగంలో పనిచేస్తున్న బాలకార్మికులను ఆపరేషన్ స్మైల్,ముస్కాన్ ద్వారా సంరక్షించి వారిని బాలల పునరావాస కేంద్రాలకు తరలించి వారి భవితకుచేయూత అందిస్తున్నాము.
ఆర్ధిక పునరావాస పధకం క్రింద 26 మంది దివ్యాంగులకుసబ్సిడీ ఋణముల ద్వారా 20 లక్షల ౩౦ వేల రూపాయలు మంజూరు చేసి మరో 20 మంది దివ్యాంగులకుసహాయ ఉపకరణాలను ఉచితంగా అందించడమైనది. దివ్యాంగులను వివాహం చేసుకునే ఇతరులకు వివాహ ప్రోత్సాహక నగదు క్రింద లక్ష రూపాయలను,14 మంది జంటలకు మంజూరు చేయడమైనది.
భవనమరియుఇతరనిర్మాణకార్మికులకు ఇప్పటి వరకు 1,581మందికి గాను వివిధ పథకాలక్రింద8 కోట్ల 24 లక్షల రూపాయలుపంపిణీ చేయడమైనది. అలాగేతెలంగాణకార్మికసంక్షేమబోర్డుద్వారా దుకాణాలు,సంస్థలు మరియు పారిశ్రామిక కార్మికులకు 132మంది లబ్ధిదారులకు4.26లక్షల రూపాయలుపంపిణిచేయడమైనది.
జిల్లాలో మిషన్ భాగీరథపధకం ద్వారా ఓఆర్ఆర్ వెలుపల ఉన్న 35,649గ్రామీణ గృహాలకుప్రతిరోజు12,285లీటర్లత్రాగునీటిసరఫరాచేయబడుతున్నది.
చెరువుల ఆయకట్టు స్థిరీకరణ మరియు భూగర్భ జలాలను మెరుగుపరిచి479 చెరువులకు FTL పరిధి నిర్ణఇంచడమైనది. తద్వారా జిల్లాలోని అన్ని చెరువులను సంరక్షించి మరియు సుందరీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచడమైనది.

పేద ఆడపిల్లల పెళ్లి, తల్లిదండ్రులకు భారం కాకుండా కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పేరుతో ఒక లక్ష 116 రూపాయల ఆర్దిక సహాయం అందిస్తున్నాం. ఈ పధకం క్రింద మన జిల్లా లో ఈ ఆర్ధిక సంవత్సరంలో వివిధ వర్గాలకు చెందిన 8 వేల 329 మంది యువతులకు 83 కోట్ల 38 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.
నిరుపేద గృహ నిర్మాణ పధకం అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. నూటికి నూరు శాతం ప్రభుత్వ వ్యయంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రధమo.జిల్లాకుకేటాయించబడిన 2350ఇళ్ళలో979ఇళ్ళనిర్మాణముచేపట్టడమైనది.అందులో665 ఇళ్లు42కోట్ల రూపాయలతో పూర్తిచేయడముజరిగినది. జి.హెచ్.ఎం.సి పరిధిలో జిల్లా పట్టణ ప్రాంతంలో 38 వేల 419రెండు పడకల ఇండ్లు మంజూరు కాగా అందులో 22 వేల 312పూర్తిచేయడమైనది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మన ఊరు మన బడి, మన బస్తి మన బడి” కార్యక్రమంలో మన జిల్లా నుండి మొత్తం 176 పాఠశాలలను గుర్తించడంజరిగింది.ఇందులో30పాఠశాలలుప్రారంభించడానికిసిద్ధంగా ఉన్నాయి. మనజిల్లావిద్యాభ్యాసంలోప్రథమస్థాయిలోఉంచేందుకు “తొలిమెట్టు” కార్యక్రమంఅద్భుతంగాజరుగుతున్నదనితెలియజేయుటకుసంతోషిస్తునాను.

నిరుపేద ఎస్.సి ల కొరకు ప్రభుత్వం “తెలంగాణ దళిత బంధు” కార్యక్రమం చేపట్టినది. ఈ పధకం క్రింద ప్రతి లబ్దిదారునికి10 లక్షల రూపాయల చొప్పున 563మందికిపలురకములైన వాణిజ్య రవాణ వాహనాలు మరియుఇతర జీవనాధార యూనిట్లు మంజూరు చేయడమైనది. షీ క్యాబ్పైలట్ ప్రాజెక్ట్ క్రింద 23 మంది లబ్దిదారులకు క్యాబ్ లనుపంపిణి చేయడం జరిగింది. తీగ జాతి పందిరి నిర్మాణ పథకము క్రింద 6 మంది ఎస్.సి రైతులకుమరియు 13 మంది ఎస్.సి నిరుద్యోగ యువతీ యువకులకు మొబైల్ టిఫిన్ సెంటర్లు మంజూరు చేయడం జరిగింది.
ఈ సంవత్సరము18వేల 520మందిఎస్.సివిధ్యార్దిని, విద్యార్ధులకు87 కోట్ల 81లక్షల రూపాయలను స్కాలర్ షిప్ ద్వారా అందిస్తున్నాము.అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి ద్వారా 60మందిఎస్.సివిధ్యార్దిని, విద్యార్ధులకు 6కోట్ల 24 లక్షల రూపాయలు మరియు ముగ్గురు గిరిజన విద్యార్థులకు60 లక్షలు రూపాయలుపంపిణి చేయడం జరిగింది. ఎస్.సిఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ద్వారా17జంటలకు42 లక్షల 50వేల రూపాయలు మంజూరు చేయడమైనది.
జిల్లాలో వెనుకబడిన తరగతుల మరియు ఆర్ధికంగా వెనుకబడిన విధ్యార్దిని, విద్యార్ధులకుఉపకార వేతనములు మరియు ఫీజ్ రియంబర్స్మెంట్పధకం క్రింద 284.46కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. 250,7,452లబ్దిదారులకు అందించడం జగురుతుంది.
మైనారిటీలలో నిరక్షరాసత్యను రూపుమాపేందుకు 8 గురుకుల కళాశాలలలో 4880మంది విద్యార్ధులకు ప్రవేశం కల్పించడమైనది. విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థులకు 3కోట్ల 38 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడమైనది.
జిల్లా పరిధిలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో 60 తెలంగాణ క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవి. యువతకి ఉపాధి కల్పించడానికి దేవరయంజాల్లోవృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి కంప్యూటర్, బ్యుటీషియన్ మరియు టైలరింగ్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.

మన జిల్లాలో ఉన్న721కిలోమిటర్ల పొడవైన రాష్ట్ర,అంతరాష్ట్ర, జిల్లా, సీసీ, బీటి రోడ్లను ఆర్ అండ్ బి మరియు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల అధ్వర్యంలో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ప్రయాణానికి అనుకూలంగా నిర్వహిస్తున్నాం.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. మహిళలకు పూర్తి భద్రత, రక్షణ కల్పించే విషయంలో పోలీస్ యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక చర్యలు మంచి ఫలితాలనిస్తునాయి. జిల్లాలో సైబరాబాద్ మరియు రాచకొండ కమీషనర్ల అధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తతతోఉంటూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా చేస్తున్నారు.
మన జిల్లాలో వెలుగొందుతున్న అతి పురాతనమైన కీసరగిరి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కీసరగిరిబ్రహ్మోత్సవాలను ఎప్పటి లాగే ఎంతో వైభవంగా భక్తీ, శ్రద్దలతో విజయవంతంగా నిర్వహించు కోవడానికి సన్నద్దంఅవుతున్నాము.
మనందరం కలలుకన్న బంగారు తెలంగాణలో మన జిల్లాను ప్రధమ స్థానంలో నిలుపుటకు అందరు కలిసి మెలిసి సమాలోచనలు, సమీక్షలు చేసుకుంటూ జిల్లాను అన్ని రంగాలలో మరింత అభివృద్ది పథంలోనడిపిస్తూ ముందుకు వెళదామని, దానికి మీఅందరి సహాయ సహకారం ఉంటుందని ఆశిస్తూ….
మన సిరులగిరి– మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
జై భారత్

Share This Post