ఘనంగా జరిగిన75వ స్వాతంత్ర్య వేడుకలు

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

ప్రచురణార్థం —-1
ప్రజాభివృద్ది సంక్షేమమే లక్ష్యం:: ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ
నిరాడంబరంగా 75వ స్వాతంత్ర్య దినొత్సవ వేడుకలు
అన్నపూర్ణగా అవతరించిన తెలంగాణ
కోవిడ్ 19 నియంత్రణ చర్యలు అందరు పాటించాలి
అర్హులైన అన్ని దళిత కుటుంబాలకు దశల వారిగా దళిత బంధు పథకం
17,052 మంది రైతులకు రూ.56.09 కోట్ల రుణమాఫీ తక్షణం అమలు
త్వరలో 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్ల అందజేత
ఉత్తమ ప్రతిభ కనబర్చిన 304 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత
కరోనా కాలంలో ఉన్నత మైన సేవలందించిన వైద్య సిబ్బందికి సత్కారం
75వ స్వాతంత్ర్య దినొత్సవ వేడుకలలో పాల్గోన్న ప్రభుత్వ మఖ్య సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ

పెద్దపల్లి , ఆగస్టు 15:-. ప్రజాభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతుందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ అన్నారు. జిల్లాలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినొత్సవ వేడుకలో ఆయన పాల్గోన్నారు. ఆదివారం ఉదయం ముఖ్య అతిథి గౌరవ వందనం స్వీకరించి జాతీయపతాకావిష్కరణ చేసారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పకడ్భందిగా అమలు చేస్తుందని తెలిపారు. కోవిడ్ 19 నియంత్రణలో భాగంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దళితుల సాధికారత లక్ష్యంగా అనేక మందితో చర్చించి సీఎం కేసిఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దశల వారిగా దళిత బంధు పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్ అర్హత వయస్సును 65 నుంచి 57 కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, త్వరలో నూతన పెన్షన్లను అందిస్తామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఒకేసారి రూ.50 వేల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని సీఎం నిర్ణయించారని, దానికి తగినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో రూ.50 వేల పంటరుణ మాఫీ కింద 17052 మంది రైతులకు రూ. 56.09 కోట్ల సోమ్మును మాఫీ చేస్తున్నామని తెలిపారు అనంతరం ముఖ్య అతిథి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చీన 125 ఉద్యొగస్తులకు ప్రశంసా పత్రాలను అందజేసారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించారు. కరోనా కాలంలో ప్రజలకు ఉన్నతమైన సేవలందించిన వైద్య సిబ్బందిని ముఖ్య అతిథి సత్కరించారు.

  అంతకు ముందు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.సంగీత సత్యనారాయణ గౌరవ వందనం స్వీకరించి జాతీయపతాకావిష్కరణ చేసారు.

 ఘనంగా జరిగిన ఈ స్వాతంత్ర్య వేడుకలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,మంథని ఆర్.డి.ఓ. కె.నరసింహమూర్తి,  పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ఈ వేడుకలలో పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీచేయనైనది.

Share This Post