ఘనంగా జాతీయ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.

హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 60వ జాతీయ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ ఘనపూర్ ఎమ్ఎల్ఎ తాటికొండ రాజయ్య, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కు, క్రీడాకారులకు, కోచ్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 17 మంది క్రీడాకారులు పాల్గొంటరని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మన రాష్ట్రంలో నిర్వహించడం హర్షనీయమని అన్నారు. పోటీలకు వరంగల్ నగరంలో మంచి ఏర్పాట్లు చేయడం అభినందనీయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు.
కేసీఆర్ గారు పర్యాటకంగా, క్రీడల అభివృద్ధి కి పెద్దపీట వేస్తున్నారన్నారు.
వీటితోపాటు క్రీడల అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు. క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
మాట్లాడుతూ 23 రాష్ట్రల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని, 600 మంది కి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద ఈవెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే నూతనంగా ఏర్పడిన హన్మకొండ జిల్లాను క్రీడల హబ్ గా ఏర్పాటు కాబోతోంది అన్నారు. అన్ని క్రీడలకి నిలయంగా హన్మకొండ లోని జె ఎన్ ఎస్ స్టేడియం వేదిక కాబోతుందన్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఎన్ ఏఓ సి కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈవెంట్ కు ప్లానింగ్, కోఆర్డినేషన్ తో కృషిచేసిన చీఫ్ వినయ్ భాస్కర్ గారికి సి పి తరుణ్ జ్యోతి గారికి, పంచాయతీరాజ్ , కూడా, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు వరంగల్ నగరంలో నున్న చారిత్రకమైన ప్రదేశాలను చూపించుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈవెంట్ లో పాల్గొన్న క్రీడాకారులు మధుర జ్ఞాపకాలను వారి వెంట తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,టి ఏ స్టాన్లీ జోన్స్, సీనియర్ వైస్ చైర్మన్ అంజూ బాబీ జార్జ్ ,స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్ రావు, కార్యదర్శి సారంగఫణి,DYSO అశోక్ కుమార్, TGO అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ A. జగన్మోహన్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post