ఘనంగా “జాతీయ బాలికల దినోత్సవం” వేడుకలు : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

పత్రికా ప్రకటన      తేది:24.01.2023, వనపర్తి.
     లింగ వివక్షను నిర్మూలించి, బాలికలను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి అన్నారు.
     మంగళవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో మహిళా, శిశు, డివ్యంగుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ బాలికల దినోత్సవం” వేడుకలకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ వివక్షను నిర్మూలించి, బాలికలను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. బాలికలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతి ఉన్నతమైనదని, బాలికలు చదువుకున్నట్లయితే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించవచ్చునని ఆయన తెలిపారు.
     అనంతరం బాలికలచే ఆయన ప్రతిజ్ఞ చేయించారు. బాలిక విద్యపై గోడపత్రికలను ఆయన విడుదల చేశారు. సంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాలు కప్పి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక విద్యను ప్రోత్సహిస్తూ, పటిష్టం చేసేందుకు కృషి చేయాలని ఆమె అన్నారు. సమాజంలో బాల, బాలికలు సమానమని, బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆమె తెలిపారు. బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి చేయాలని, అధికారులంతా బాలికల అభ్యున్నతకి తోడ్పాటును అందించాలని ఆమె సూచించారు. బాలికలలో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలన్నారు. ఆడపిల్లలకు సరైన దిశా నిర్దేశం చేస్తూ వారిని తీర్చిద్దేందుకు కృషి చేయాలని ఆమె అన్నారు. ఆత్మవిశ్వాసంతో బాలికలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని, తల్లిదండ్రులు బాలురను, బాలికలను సమానంగా పెంచే దృక్పథం రావాలని ఆమె అన్నారు.
     భ్రూణ హత్యలు, పిండ నిర్దారణా పరీక్షలు, పూర్తి స్థాయిలో నిర్మూలించుటకు సమాజంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో బాల్య వివాహాలు, బ్రూణ హత్యలు, బాల కార్మిక నిర్మూలనకు కృషి చేయాలని ఆమె అన్నారు. బాలికలు చదువుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆమె తెలిపారు. బాలికలు చదువుకున్నట్లయితే తమ హక్కులపై వారికి అవగాహన కలుగుతుందని, అన్ని రంగాలలో ఉన్నత స్థానాలకి ఎదిగేందుకు చదువు తోడ్పడుతుందని ఆమె తెలిపారు.
     జిల్లా సంక్షేమ అధికారిని కాళీ క్రాంతి మాట్లాడుతూ బాలికల చదువు, ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యతను ప్రోత్సహించడం కొరకు “జాతీయ బాలిక దినోత్సవం”ను  ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. లింగ వివక్షను నిర్మూలించి బాలురు, బాలికలు సమానమేనని, తల్లిదండ్రులు తమ పిల్లలను సమానంగా పెంచాలని ఆమె సూచించారు. ఆడపిల్లలు చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
      ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని కాళీ క్రాంతి, సి డబ్ల్యూ సి చైర్మన్ అలివేలమ్మ, జడ్పిటిసి రాజేంద్రప్రసాద్, వెంకట్రామమ్మ, చైల్డ్ లైన్ డైరెక్టర్, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
……
జిల్లా పూర్వ సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post