ఘనంగా జిల్లా లో రైతు దినోత్సవ కార్యక్రమాలు ఎడ్ల బండ్ల ర్యాలీ, బోనాలు, డప్పు సప్పులతో స్వచంధం గా రైతు వేదికల దగ్గరికి కదిలిన రైతన్నలు, గ్రామస్తులు ఖిలా వరంగల్ , వర్ధన్నపేట, రాయపర్తి మండలాల లోని రైతు వేదికల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రచురునార్ధం

వరంగల్

శనివారం

ఘనంగా జిల్లా లో రైతు దినోత్సవ కార్యక్రమాలు

ఎడ్ల బండ్ల ర్యాలీ, బోనాలు, డప్పు సప్పులతో స్వచంధం గా రైతు వేదికల దగ్గరికి కదిలిన రైతన్నలు, గ్రామస్తులు

ఖిలా వరంగల్ , వర్ధన్నపేట, రాయపర్తి మండలాల లోని రైతు వేదికల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

రైతు సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించ్చిందని
జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు

శనివారం రోజున దశాబ్ది ఉత్సవాలు 02 రోజులో భాగంగా జిల్లా. కలెక్టర్ పి. ప్రావీణ్య తూర్పు నియోజకవర్గం ఖిలా వరంగల్ మండలం స్థంభంపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గం కట్రీయాల, రాయపర్తి మండలం మురిపిరాల లో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు

ముందుగా స్థంభంపల్లి రైతు దినోత్సవ కార్యక్రమం లో పాల్గొనడానికి ఎడ్ల బండి మీద శాసనమండలి డిప్యుటీ చైర్మన్ బండ. ప్రకాష్, తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ లతో కలిసి కలెక్టర్ రైతు వేదిక ప్రాంగాణనికి చేరుకున్నారు

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ గీతాపాలన చేశారు

అనంతరం
రాయపర్తి మండలం మురిపరాల గ్రామంలో అలాగే వర్దన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద గల కాట్రయాలా లో
ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

మురిపారాల లో ఏర్పాటు చేసిన
రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కట్టుకున్న ప్రాజెక్టు లు,రైతుబంధు ,రైతు బీమా ఉచిత విద్యుత్, రైతు వేదికలతో రైతులకు వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలతో వ్యవసాయ రంగం లో సాధించిన ప్రగతిని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు

2014 కంటే ముందు జిల్లా లో లక్ష 70 వేల ఎకరాలకు ఉండగా…. 9 సంవత్సరాలలో 3లక్షల 10 ఎకరాల వరకు నేడు పంట విస్తీర్ణం పెరిగిందన్నారు

20వేల ఎలక్ట్రికల్ కనెక్షన్లు ఉంటే.. ఇప్పుడు అవి 65 వేలకు చేరుకున్నాయని అన్నారు.

ఆయిల్ ఫామ్ సాగులో రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు ఆరంభించి సాగులో మెలకువలు తెలుసుకోవాలన్నారు

రాయపర్తి లో ఆయిల్ ఫామ్ పంట ను పెద్ద ఎత్తున సాగు చేయడం సంతోషకరమ్మన్నారు.

03సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ఈ సాగులో రైతులు అధిక పంట సాధించవచ్చన్నారు

జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 1లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు.

వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల నుండి ఇప్పటికే 70000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు

ఇంత కు ముందు ఇంత మొత్తం లో పాడి రాలేదని.. 2014 కి ముందు
మొత్తం జిల్లా వ్యాప్తంగా 80000 మెట్రిక్ టన్నులు వచ్చిందని, 3,34,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నారు

వరంగల్ జిల్లాలో రైతు బంధు పథకం ద్వారా 1300 కోట్ల రూపాయలు రైతులకు అందజేశామని వివరించారు

100 కోట్ల రూపాయలు రైతు బీమా ద్వారా లబ్ధి చేకూరిందని..
ఈ క్లస్టర్లో 33 కోట్ల రూపాయలతో రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందించామని చెప్పారు .

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇంత ఘనంగా రైతు దినోత్సవం జరుపుకుంటున్నామని… రైతులతో సమావేశమై వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వ్యవసాయ రంగంలో నూతన పద్ధతుల ద్వారా సరికొత్త మార్పులు అందించే విధంగా రైతు దినోత్సవం ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.

ఈ నెల 22 వరకు దశాబ్ది ఉత్సవాలను ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుపుకోవడానికి అందరూ పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు

ఆ తర్వాత వర్ధన్నపేట మండలం కట్ర్యాల రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహించిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని..
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని అన్నారు.

ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల గతంతో పోలిస్తే వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతుల కోసం ప్రభుత్వం ధరణితోపాటు రైతుబంధు రైతు బీమా, రుణమాఫీ అమలు చేసిందని తెలిపారు.

అనంతరం కలెక్టర్ పి. ప్రావీణ్య,, శాసనసభ్యులు ఆరూరి రమేష్, రైతుల తో కలిసి సహాపంక్తి భోజనం చేసారు

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Share This Post