ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి

పత్రిక ప్రకటన–

తేదీ : 17–09–2022

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి​

పోలీసుల గౌరవ వందనం… అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మేడ్చల్​–మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుంచామని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు , నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను షామీర్​పేటలోని  కలెక్టరేట్​ కార్యాలయం పెరేడ్​ గ్రౌండ్స్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్ళలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి అభివృద్దిలో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థులు చేసిన  సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో   జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్​, జిల్లా రెవెన్యూ అధికారి  లింగ్యానాయక్​, బాలానగర్​ డీసీపీ సందీప్​,   కలెక్టరేట్​ ఏవో వెంకటేశ్వర్లు, , ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు , నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి  వారి సందేశము

మన తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను “తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవంగా” జరుపుకుంటున్నoదుకు మరియు 75వ వజ్రోత్సవ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సమస్త జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ సందర్బంగా తెలంగాణ  కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.

రాష్ట్రంలో హరితహారంలో బాగంగా మొక్కలను నాటడంలో విప్లవాత్మకమైన మార్పులు మన గౌరవ ముఖ్య మంత్రి గారు చేపట్టడం వల్ల మన జిల్లాలోను మరియు రాష్ట్రంలోనూ అటవీ విస్తీర్ణం పెరిగింది. మన జిల్లాలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీటి సరఫరా అందించడం జరుగుతున్నది మరియు మిషన్ కాకతీయ క్రింద చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నవి.

దేశంలోనే మొట్ట మొదటి సారిగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్య మంత్రి గారు, 2018 వ సంవత్సరములో పంటల సాగు పెట్టుబడికి ఉపయోగించుకొనుటకు వీలుగా రైతులకు “రైతు బంధు పథకం” ప్రవేశపెట్టబడినది.  రైతులందరికి పంటల సాగు పెట్టుబడి క్రింద సంవత్సరానికి ఎకరాకు పది వేలు              (రూ. 10,000) రూపాయల చొప్పున గత సంవత్సరంలో 34 వేల 474 రైతులకు రూ. 100 కోట్ల 91 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జమచేయ బడినవి మరియు అర్హులైన 564 దళిత అభ్యర్ధులకు,  ప్రతి ఒక్కొరికి పది లక్షల (రూ. 10.00 లక్షలు) రూపాయల చొప్పున “దళిత బంధు పథకం” ద్వారా సుమారుగా 56 కోట్ల 40 లక్షలు రూపాయలు అందచేయడం జరుగుతున్నది. ప్రస్తుత సంవత్సరం ప్రభుత్వ అనుమతి మేరకు ప్రతి నియోజిక వర్గానికి 500 మంది లబ్దిదారులను ఎంపిక చేయుటకు కార్యాచరణ ప్రారంభించబడినది.  ఈ పథకాలు దేశానికి ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.

జిల్లాలో ప్రజలకు కరోనా మూడవ మోతాదు వాక్సినేషన్ కొనసాగుచున్నది. జిల్లాలోని ఆల్వాల్ లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) వేయి పడకల ఆసుపత్రిని వేయి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణము చేయుటకు గౌరవ ముఖ్య మంత్రి గారి చేతులమీదుగా శంఖుస్థాపన చేయబడినది. శామీర్ పేట మరియు మేడ్చల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతస్థాయి ఆసుపత్రులుగా  మార్చటం జరిగినది.

తెలంగాణ రాష్ట్రoలో పారిశ్రామిక అనుమతులు స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం (TSiPASS Act,2014) క్రింద ఇప్పటి వరకు,  ఐదు వేల రెండు వందల యబై ఒక్క (5251) మంది  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు (8976) పరిశ్రమలకు అనుమతులు ఇప్పించడం జరిగింది . ఈ జిల్లాలో  ఇప్పటి వరకు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు (9675) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మరియు భారీ పరిశ్రమలు,  సుమారు పదకొండు వేల కోట్ల తొమ్మిది వందల ముప్పై ఐదు లక్షల (రూ. 11,935) రూపాయల పెట్టుబడి తో స్థాపించబడి, సుమారు  రెండు లక్షల పదమూడు వేల (2,13,000) మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం క్రింద నమోదు చేసుకున్న”1397” నిర్మాణ కార్మికుల లబ్ధిదారులకు, బోర్డు ఈ పథకాలను అమలు చేస్తోంది, ఈ పధకం క్రింద ఇప్పటి వరకు మొత్తం (రూ. 7.42) ఏడు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయబడినది.

జిల్లాలో 636 చౌక ధరల దుకాణముల ద్వారా మొత్తం 5,24,301 ఆహార భద్రత కార్డుల ద్వారా 17.29 లక్షల యూనిట్లకు ప్రతి మాసము సుమారుగా 26352 మెట్రిక్ టన్నుల బియ్యం, 2026 మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు 18 టన్నుల చక్కెర పంపిణీ చేయడం జరుగుచున్నది. ఈ సంవత్సరము జిల్లాలో  కొత్తగా 57,388  ఆహార భద్రత కార్డులు మంజూరు చేయబడినవి.

జిల్లాలో ఆసరా పెన్షన్ క్రింద  వృధ్యాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు మరియు ఒంటరి  మహిళలకు ప్రతి నెల ఒక్కొకరికి రూ. 2016 మరియు దివ్యాంగులకు రూ. 3016 చొప్పున మొత్తం 1,50,912 మందికి పెన్షన్లు అందించడం జరుగుతుంది.

బ్యాంక్ లింకేజ్ లో ఉత్తమ ప్రగతి సాదించినందుకు జిల్లాకు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డ్ మరియు ప్రశంసా పత్రం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం జరిగింది.

షెడ్యుల్డ్ కులాల, షెడ్యుల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖల ద్వారా 52 వసతి గృహాల పాఠశాలలు మరియు కళాశాలల ద్వారా 9120 విద్యార్ధిని విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు.  సుమారుగా రూ. 297 కోట్ల రూపాయలను ఉపకారవేతనం క్రింద వివిధ కులాల విద్యార్ధిని విద్యార్ధులకు అందచేయడం జరుగుతున్నది.

జిల్లాలో గర్భిణులకు మరియు బాలింతలకు  ఆరోగ్యలక్ష్మి  పథకం  ద్వారా “12,368” మంది లబ్దిపొందుతున్నారు మరియు సుమారుగా 57,988 పిల్లలకు పౌష్టిక ఆహరం అందించడం జరుగుతున్నది.

మన జిల్లాలో యువతకి  ఉపాధి కల్పించడానికి  వృత్తి  నైపుణ్య  శిక్షణ కేంద్రoలో కంప్యూటర్, బ్యుటీషియన్ & టైలరింగ్ తరగతులలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.

జిల్లాలో ఉన్న అన్ని గ్రామపంచాయితీలలో, మునిస్పిపాలిటీలలో మరియు కార్పోరేషన్లలో “వైకుంఠ ధామాల” నిర్మాణము, క్రీడా ప్రాంగణము, కంపోస్ట్ షెడ్ నిర్మాణము చేయబడి ఉపయోగించబడుతున్నవి. హరిత హారం మొక్కల నర్సరీ ఏర్పాటుతో పాటు పల్లె ప్రకృతి వనాలు మరియు పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయటము జరిగినది. ప్రభుత్వము విడుదల చేయుచున్న పట్టణ ప్రగతి నిధులు 2022-23 సంవత్సరనకుగాను ఇప్పటి వరకు రూ. 465 లక్షలు రూపాయిలు విడుదల చేయనైనది. పారిశుధ్యము పచ్చదనము నిర్వహణ చేయబడుతున్నది.

సమీకృత మార్కెట్ యార్డుల మరియు మోడరన్ వైకుంటధామాలు నిర్మాణము చేపట్టబడినది, ఇట్టి నిర్మాణమునకు  రూ. 12.27 కోట్లు మంజూరు చేయబడినవి.

సమీకృత మత్శ్య అబివృద్ధి పథకం ద్వార ఉచిత చేప పిల్లల సరఫరా పథకం క్రింద 2022-23 సంవత్సరానికి గాను  జిల్లా లో 333 చెరువులకు 91.00 లక్షల చేప పిల్లలు పంపిణి చేయబడినది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కార్యక్రమంలో మన జిల్లాలో నుండి మొత్తం 176 పాఠశాలలో 12 అంశాలలో, మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో  జిల్లాలో వివిద పాఠశాలలో చదువుతున్న సుమారు 98,733 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయటం జరుగుతుంది.

గొర్రెల అభివృద్ది పధకము మరియు గేదెలు / ఆవులు పంపిణి పధకము క్రింద మన జిల్లాలో ఇప్పటి వరకు 75 శాతం సబ్సిడి పై 51.09 కోట్ల రూపాయల వ్యయంతో 3864 గొర్రెలను మరియు 284 పాడి పశువులను, పంపిణి చేయడo జరిగినది.

ఈ జిల్లాకి మొత్తం 2350 రెండు పడక గదుల గృహాలు కేటాయించబడ్డాయి. ఇందులో 639 గృహాల నిర్మాణము పూర్తికాబడినవి. ఇందుకుగాను 34.00 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడినవి.  మిగిలిన గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పధకం క్రింద,  లక్షా 116 రూపాయలు చొప్పున ప్రతి పేద ఆడపిల్లకు అందించుచున్నాము. ఇంతవరకు 13289 మంది లబ్దిదారులకు సుమారు 133 కోట్ల రూపాయలు పంపిణీ చేయబడినవి.

రాబోయే కాలంలో అందరమూ ఇలాగే కలిసిమెలిసి  సమాలోచనలు, సమీక్షలు చేసుకుంటూ జిల్లాను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు వెళదామని, దానికి మీ అందరి సహకారం  ఉంటుందని  ఆశిస్తూ…..

మన సిరుల గిరి – మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా

Share This Post