ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతణ దినోత్సవం వేడుక ఏర్పాట్లు*   మంగళ వారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతణ దినోత్సవం వేడుక ఏర్పాట్లు*    మంగళ వారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*మే 24*

*ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతణ దినోత్సవం వేడుక ఏర్పాట్లు*

మంగళ వారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కరోనా వల్ల ఎలాంటి వేడుకలు నిర్వహించలేదని ఈ సారి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు.

సభా ప్రాంగణంలో ప్రజాప్రతినిధులకు , జిల్లా అధికారులకు, అవార్డు గ్రహి తలకు అదేవిదంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి విచ్చేసే ప్రజలకు, విద్యార్థులకు మంచి నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిసుబ్రoగా ఉండేలా పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వివిధ శాఖలు సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని మాపక వాహనాలను ప్రాంగణ పరిధిలో సిద్ధంగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స నిమిత్తం సిబ్బందిని ఏర్పాటుచేసి అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పోలీస్ శాఖ బందో బస్తు ఏర్పాట్లను చూడాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం లో భాగంగా న కవి సమ్మేళనం ను జూన్ రెండవ తేదీన సాయంత్రం స్థానిక అంబేద్కర్ భవన్ లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబిబెంచే విధంగా తెలిపేలా కవితలు ఉండాలనీ కవులు, రచయితలు, కళాకారులు, ప్రభుత్వ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలనీ అయన కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిసిపి అశోక్, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్,

జిల్లా ఉన్నత అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.             

Share This Post