ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:02.06.2022, వనపర్తి.

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయం ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకు ముందు పోలీసు శాఖ వారి గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో దేశానికే దిక్సూచిలా నిలిచిందని, అనతి కాలంలోనే అద్భుత విజయాలను సాధించిందని, రాష్ట్రం సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నుంచి ప్రశంసలు అందుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్థతకు నిదర్శనమన్నారు. జిల్లాలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల రాబోయే విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి 45 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఆయన సూచించారు. జె ఎన్ టి యు పీజీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు, 60 మంది బి ఫార్మసీ విద్యార్థులకు తరగతులు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి సూచించారు.
జాతీయ అసంక్రమిత వ్యాధుల కార్యక్రమం, సేవలో వనపర్తి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా ప్రజలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అందిస్తున్న సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఉత్తమ పురస్కారం అందుకోవడం సంతోషదాయకం అన్నారు. జిల్లాలో కెసిఆర్ కిట్ పథకం ప్రారంభించిన తర్వాత ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది అన్నారు. జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి 150 మందికి ప్రవేశం లభిస్తుందన్నారు. కళాశాలలకు అనుబంధంగా ప్రస్తుతం ఉన్న వంద పడకల ఆసుపత్రిని 330 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించడం జరిగిందన్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో వనపర్తిలో వెయ్యి పడకల ఆసుపత్రి రూపుదిద్దుకుంటుందన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 104 ఉప కేంద్రాలు, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉండగా, కొత్తగా రూ. 17 కోట్ల వ్యయంతో 180 పడకల గర్భిణీ, ప్రసవానంతర వైద్య సేవలు, నవజాత పిల్లల సంరక్షణ కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో త్వరలో బస్తీ దవాఖానలు ప్రారంభం కానున్నట్లు మంత్రి వివరించారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 69 వేల 84 ఎకరాలు ఆయకట్టుకు గానూ 2021-22 సం.నికి 154 చెరువులు నింపడం ద్వారా వాన కాలంలో 69 వేల 84 ఎకరాలకు, యాసంగిలో 19 వేల 413 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని ఆయన వివరించారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పేజ్ 2 కు 12 వేల 374 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 12 వేల 208 ఎకరాల భూమిని సేకరించి రూ. 190 కోట్ల 88 లక్షలు రైతులకు నష్టపరిహారంగా చెల్లించడం జరిగిందని ఆయన సూచించారు. రైతులకు సీజన్ ప్రారంభంలో విత్తనాలు, చెరువులకు పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, యాసంగి 2022 సం.నికి ఒక లక్ష 58 వేల 323 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 179 కోట్ల 92 లక్షల 46 వేల 598 రూపాయలు జమ చేయడం జరిగిందని, రూ. 1243 కోట్ల 22 లక్షలు జమ చేయడం జరిగిందని మంత్రి వివరించారు. చిట్యాల గ్రామ శివారులో 44 కోట్ల 50 లక్షల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన మార్కెట్ యార్డును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. జాతీయ సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా పండ్ల తోటల వ్యాప్తి, నిర్వహణ నిమిత్తం 20 లక్షల వ్యయంతో, రెండు వందల హెక్టార్ల విస్తీర్ణంలో అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
జిల్లాలో 11 వేల 318 మంది సభ్యులతో 118 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నట్లు ఆయన సూచించారు. 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలో రెండు కోట్ల 30 లక్షల చేప పిల్లల సరఫరా చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. హరితహారం లో భాగంగా 2021 వానాకాలంలో జిల్లాలో 26 లక్షల 78 వేల ఎనిమిది వందల మొక్కలు నాటాలని లక్ష్యం ఉండగా, 29 లక్షల 46 వేల 900 మొక్కలు నాటకం జరిగిందని మంత్రి వివరించారు. దళితుల అభ్యున్నతికి కై దళిత బంధు పథకం చేపట్టినట్లు, మొదటి విడతగా జిల్లాలో మొత్తం 199 యూనిట్లకు 19 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి సూచించారు. 2021- 22 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం క్రింద ఒక్కొక్కరికి 30 వేల రూపాయల చొప్పున 73 మందికి 18 లక్షల 40 వేల రూపాయలు చేయడం జరిగిందని ఆయన సూచించారు. 2021- 22 సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ పథకం క్రింద ఇప్పటివరకు 4 వేల 269 స్వయం సహాయక సంఘాలకు 220 కోట్ల 20 లక్షల రూపాయలు రుణాలు అందించగా రాష్ట్రస్థాయిలో పురస్కారాన్ని అందుకోవడం జరిగిందని, ఇందుకు కృషిచేసిన సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.
2021- 22 సంవత్సరంలో జిల్లాలోని 509 పాఠశాలల్లో 98 లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనం ద్వారా అందించడం జరిగిందని ఆయన అన్నారు. 2022- 23 విద్యాసంవత్సరంలో ఒకటి నుండి పదవ తరగతి చదివే విద్యార్థులకు రెండు లక్షల 75 వేల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం క్రింద జిల్లాలో మొదటి దశలో 3 వేల 765 గృహాలు మంజూరయ్యాయని, ఇప్పటివరకు ఒక వెయ్యి 158 గృహాలు పూర్తి అయినట్లు, 344 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మిగతా ఇండ్లు నిర్మాణ పనుల పురోగతిలో ఉన్నాయని ఆయన అన్నారు. జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రాలకు ఒక వరుస రోడ్లను రెండు వరసల రోడ్లు గా మార్చడానికి 184 కిలోమీటర్ల పనులను సుమారు 302 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టి, 151 కిలోమీటర్ల పనులను పూర్తి చేయడం జరిగిందని, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి వివరించారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలలో 2021- 22 సంవత్సరానికి రెండు కోట్ల 38 లక్షల రూపాయల పన్ను లక్ష్యానికి గాను 100 శాతం పన్ను వసూలు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. 2022 ఏప్రిల్ మాసానికి జిల్లా సరాసరి భూగర్భ మట్ట ము 4.83 మీటర్లు కాగా గత ఏడాది ఇదే నెలలో 3.74 మీటర్లుగా ఉన్నదని, గత ఏడాదితో పోల్చ గా భూగర్భ జల మట్టం 1.09 లీటర్లు తగ్గిందని ఆయన అన్నారు. ఎస్పీ కార్యాలయం భవన నిర్మాణం నిమిత్తం 38 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టి 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, మిగతా పనులు పూర్తి జరుగుతుందని మంత్రి తెలిపారు.
జిల్లాలో ధరణి లాగిన్ లో పరిష్కరించబడని వివిధ రకాల భూ సమస్యల దరఖాస్తులు 14 వేల 878 దరఖాస్తులు రాగా 14 వేల 671 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిష్కరించి వనపర్తి జిల్లాను రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిపినందుకు మంత్రి, కలెక్టర్ ను అభినందించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించుటకు 10, 33/11 కె.వి ఉప కేంద్రాలను నిర్మించడం జరిగిందని, ఐదు ఉప కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని, 13 ఉప కేంద్రాలు ఆదిత్య పథకంలో మంజూరు అయ్యాయని మంత్రి వివరించారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. అలాగే వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ధరణీ, పౌరసరఫరాల శాఖ, విద్యుత్తు, హరితహారం, స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్, బిసి, ఎస్.టి. సంక్షేమ శాఖ, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, మద్యనిషేధం, అబ్కారీ శాఖ, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు, గ్రామీణ అభివృద్ధి శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యాశాఖ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, రహదారులు, భవనాల శాఖ, మున్సిపాలిటీ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, పంచాయతీ శాఖ, జిల్లా పరిషత్, పరిశ్రమల శాఖ, సహకార శాఖ, చేనేత, జోలి శాఖ, గనులు, గర్భ జల శాఖ, శాంతిభద్రతల శాఖలు జిల్లాలో అమలు అవుతున్నాయన్నారు. చందాపూర్ గ్రామం “చిన్నపిల్లల స్నేహ పూర్వక గ్రామంగా” అవార్డు పొందటం అభినందనీయమని ఆయన అన్నారు. అదే స్ఫూర్తితో జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి సాధించే దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు.
అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి, జిల్లా కలెక్టర్ సత్కరించారు. దళిత బంధు పథకం కింద 13 మందికి మంజూరైన యూనిట్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, జిల్లా అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవిన్యూ) డి..వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమర యోధులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post