ఘనంగా బసవేశ్వరుని 889 జయంతి వేడుకలు

ఘనంగా బసవేశ్వరుని 889 జయంతి వేడుకలు

*ప్రెస్ రిలీజ్* *తేదీ 02.05. 2022*

*హనుమకొండ*

*ఘనంగా బసవేశ్వరుని 889 జయంతి వేడుకలు*

సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది, లింగాయత ధర్మ స్థాపకుడు బసవేశ్వరుని 889వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం నాడు హనుమకొండ, కాకాజీ కాలనీ,ఎస్.ఎస్.వి కళ్యాణ మండపంలో జిల్లా వెనకబడిన తరగతుల శాఖ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్* హాజరై బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వర ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని, సమాజంలో బసవేశ్వరుడు కులవ్యవస్థను, వర్ణవిబేదాలను, లింగవ్యవస్థను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అని, ఆయన బోధించిన సాంప్రదాయమే అనంతర కాలంలో లింగాయత ధర్మంగా స్థిరపడిందని పేర్కోన్నారు. దానం, ధర్మం, సమ సమాజం కోసం పాటుపడిన సామాజిక వేత్త అయిన బసవేశ్వరుడు చూపిన బాటలో ప్రతిఒక్కరు నడవాలని ఆయన పేర్కోన్నారు.

ఈ సంధర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చలి వెంద్రం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేట్ వేముల. శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి కె. శంకరయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విధుమౌళి, ఈశ్వరయ్య, సర్వేశ్వర్, గౌరి శంకర్, సురేష్, సాంబయ్య, కోటేశ్వర్, సురేష్, రాజేష్,అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గోన్నారు.   

Share This Post