ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ , జూన్ 02 : జిల్లా లోని ఖిలా వరంగల్ లో గల ఖుష్ మహల్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు
పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి
తన ప్రసంగాన్ని ప్రారంభించి, వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు.

ఆ తరవాత తెలంగాణ అమరవీరుల కుటుంబాల ను సన్మానించారు
ఆ కార్యక్రమం అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన లను వీక్షించి వారిని అభినందించారు

ఉత్తమ ఉద్యోగుల కు ప్రశంస పత్రాలను అందించి… వివిధ శాఖ లా ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్య అతిధులు సందర్శించారు

చివరగా 16 మంది దళిత లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను అందచేశారు

తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన మంత్రి

అంతకు ముందు
రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మధ్య కోట లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు, శాసనసభ్యులు నన్నపునేని నరేందర్,
కలెక్టర్ గోపి తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం,15 ఏళ్ల కేసిఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి అన్నారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయం అని, రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఎంపీ దయాకర్, zp చైర్ పర్సన్, శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మా రెడ్డి, ఆరురి రమేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు

Share This Post