ఘనంగా వాల్మీకి జయంతి

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు కలెక్టరేట్లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ కార్పొరేషన్ ఈ డి రమేష్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, మెప్మా పిడి రాములు, జిల్లా బిసి హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు ఎం.రాజేశ్వర్ , జిల్లా బోయ సంఘం అధ్యక్షులు నరేష్, రాష్ట్ర బోయ సంఘం ఉపాధ్యక్షులు రాజేశ్వర్, జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్, ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post