*ప్రెస్ రిలీజ్*
*హనుమకొండ*
*సెప్టెంబర్ 18*
*ఘనంగా సాంస్కృతిక వేడుకలు*
*స్వాతంత్య్రం కోసం,తెలంగాణ కోసం పోరాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
*ఓరుగల్లు గడ్డ కళాకారుల అడ్డ
*స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకే ఈ వేడుకలు : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
*తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు*
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ , గ్రామీణ, గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ,తదుపరి 12 మంది స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేశారు .తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రజాకార్లు చేసిన పనులకు, అఘాయిత్యాలకు, వాళ్ళ మాటలు పడలేక తెలంగాణ రాష్ర్టానికి రజాకార్ల నుండి ఎపుడు విముక్తి వస్తుందా అని పోరాటం చేశారు. కళాకారులను పోషించాలనుకొన్నారు కెసిఆర్. స్వాతంత్య్రం కోసం, తెలంగాణ కోసం ,బీజేపీ పోరాటం చేయలేదని, ఇప్పుడు తెలంగాణాలో రాజకీయాలను రెచ్చగొడుతూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. రజాకార్లపై కమ్యూనిస్టు పార్టీలు నిజాంకు వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేశాయన్నారు. మహాత్మాగాంధీ ,అంబేడ్కర్ స్ఫూర్తి ని తీసుకొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని ,అదే స్ఫూర్తితో 8 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ,స్వాతంత్య్రాన్ని సంపాదించిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ, ఈ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.నిజాం పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని,ఎంతో మంది త్యాగధనుల పొరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని,అస్థి నష్టం ,ప్రాణ నష్టం కలిగిన పొరాడరన్నారు.నీళ్ళు ,నిధులు,నియామకాలు అనే నినాదం తో తెలంగాణ సాధించుకొని,అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామన్నారు.ఒరుగల్లు గడ్డ కళాకారుల అడ్డా అని అన్నారు .వివిధ విభాగాలకు చెందిన తోటి కళాకారుల నృత్యాలు పాటలు మిమిక్రీ ప్రేక్షకులను అలరించాయి.
ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధ్యక్షత వహించగా ,కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.