ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలు చీర్యాల క్రీడామైదానంలో బాణాసంచా పేల్చి సంబరాలు సంబరాల్లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్​,

పత్రిక ప్రకటన

తేదీ : 14–08–2022

ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలు
చీర్యాల క్రీడామైదానంలో బాణాసంచా పేల్చి సంబరాలు
సంబరాల్లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్​, లింగ్యానాయక్, అధికారులు
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచన మేరకు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం చీర్యాల క్రీడా మైదానంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అదనపు కలెక్టర్​ శ్యాంసన్​ మాట్లాడుతూ… వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్​ ఆదేశాల ఈ నెల 22వ తేదీ వరకు ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా బాణాసంచ పేల్చి సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్​ లింగ్యానాయక్​,ఏ ఓ.వెంకటేశ్వరలు ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, సర్పంచ్​ ధర్మేంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post