ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 8:

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సంబరాలు అంబారాన్ని తాకాలని, జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి నగర పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి తహశీల్దార్లు, ఎస్హెచ్ఓలు, ఎంఇవోలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేడుకల నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రణాళిక బద్దంగా వేడుకలు విజయవంతం చేయాలన్నారు. రెండు వారాలపాటు వేడుకలు చేపట్టనున్నట్లు, జిల్లాలో పండుగ వాతావరణం కనిపించాలన్నారు. 8వ తేదీన రాజధాని నగరం హైదరాబాద్ లో వేడుకలు ప్రారంభం అయ్యాయన్నారు. ఆగష్టు 9వ తేదీన జాతీయ పతాకాలు ఇంటింటికీ పంపిణీ చేయాలని 11 లోగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు, 16 నుండి 22 వరకు 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు సినిమా హాల్ లలో గాంధీ పై రూపొందించిన చిత్రాన్ని ఉచితంగా చూపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు, పాఠశాలలు, సినిమాహాళ్ల మ్యాచింగ్, బ్యాచింగ్ చేసినట్లు ఆయన అన్నారు. 10వ తేదీన విస్తృతంగా జిల్లా,మండల అధికారులు వనమహోత్సవం లో పాల్గొని మొక్కలు నాటడం, ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేయడం చేయాలన్నారు. 11వ తేదీన క్రీడాకారులతో పాటు యువత స్వచ్చందంగా ఫ్రీడ్సమ్ రన్ నిర్వహించాలన్నారు. 13వ తేదీన ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ కలిగించేలా విద్యార్థులతో, ఎన్ సిసి, ఎన్.ఎస్.ఎస్., ఎన్జీవోల తో ర్యాలీలు నిర్వహించాలన్నారు. 14వ తేదీన తెలంగాణ సాంస్కృతిక సారధులచే జిల్లా, నియోజక వర్గాలలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 16వ తేదీన జిల్లాలో అన్నిచోట్ల ఒకే సమయంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టాలన్నారు. 17వ తేదీన జిల్లా మండల కేంద్రాలలో సుమారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. 18వ తేదీ గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలలో ప్రణాళికపరంగా క్రీడోత్సవాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. 19వ తేదీ జిల్లాలోని హాస్పిటల్స్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలలో పండ్లు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేయాలన్నారు. 21వ తేదీన సమావేశాలు నిర్వహణ, 22వ తేదీన ముగింపు కార్యక్రమాలు వుంటాయని ఆయన తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, పటిష్ట కార్యాచరణ తో వేడుకలు చేపట్టాలని అన్నారు. వేడుకలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు సినిమా చూసే సినిమా హాళ్లను పర్యవేక్షించి, ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. భద్రతాపరంగా అన్ని చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపి షబరీష్, డిఆర్వో శిరీష, డీఆర్డీవో విద్యాచందన, డిపివో హరిప్రసాద్, డిఇఓ యాదయ్య, ఆర్టిఓ కిషన్ రావు, డివైఎస్ఓ పరంధామ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post